ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కోవిడ్ టీకా మందు తాలూకు ఒకటో డోజు నుఅందరూ తీసుకున్నందుకు గాను దేవభూమి ప్రజల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 18 OCT 2021 2:50PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 18 సంవత్సరాల పైబడిన వయో వర్గాని కి చెందిన ప్రజల కు అందరికీ కోవిడ్-19 టీకా మందు తాలూకు ఒకటో డోజు ను తీసుకొన్న దేవభూమి ఉత్తరాఖండ్ లోని ప్రజల కు అభినందన లు తెలిపారు. ఉత్తరాఖండ్ సాధించిన ఈ కార్యసిద్ధి కోవిడ్-19 కి వ్యతిరేకంగా దేశం జరుపుతున్న పోరాటం లో అతి ముఖ్యమైందని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింహ్ ధమీ పొందు పరచిన ఒక ట్వీట్ కు, ప్రధాన మంత్రి ప్రత్యుత్తరమిస్తూ;

‘‘దేవభూమి ప్రజల కు చాలా చాలా శుభాకాంక్షలు. కోవిడ్ కు వ్యతిరేకం గా దేశం సాధిస్తున్న పోరాటం లో ఉత్తరాఖండ్ యొక్క ఈ కార్యసిద్ధి అత్యంత మహత్వ పూర్వమైనటువంటిది గా ఉంది. విశ్వమారి తో పోరాడటం లో మన టీకాకరణ కార్యక్రమం అన్నింటి కంటే ఎక్కువ ప్రభావాన్ని ప్రసరించేది గా నిరూపణ కానుందని నాకు విశ్వాసం ఉంది. మరి దీనిలో ప్రతి ఒక్క వ్యక్తి తాలూకు భాగస్వామ్యానికి అగ్రతాంబూలం ఉంది’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(Release ID: 1764681)