ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ మాన‌వహ‌క్కుల సంఘం (ఎన్‌ హెచ్ఆర్‌ సి) 28వ స్థాపన దిన కార్యక్రమాని కి హాజరైన ప్రధాన మంత్రి


భారతదేశస్వాతంత్య్ర ఉద్యమం మరియు భారతదేశం చరిత్ర .. ఇవి మానవ హక్కుల కు ఒక గొప్ప ప్రేరణను అందించాయి:  ప్రధాన మంత్రి

మన బాపు ను మానవ హక్కుల కు మరియు మానవ విలువల కు ఒక ప్రతీక గా యావత్తు ప్రపంచం భావిస్తుంది: ప్రధాన మంత్రి

మానవహక్కుల భావన అనేది పేదల గౌరవం తో సన్నిహిత సంబంధం కలిగినటువంటిది:  ప్రధాన మంత్రి

మూడుసార్లతలాక్ కు వ్యతిరేకం గా ఒక చట్టాన్ని చేయడం ద్వారా ముస్లిమ్ మహిళల కు కొత్త హక్కులను మేము ఇచ్చాము:  ప్రధాన మంత్రి

భారతదేశంఉద్యోగాలు చేసుకొనే మహిళల కు 26 వారాల పాటు వేతనంతో కూడిన మాతృత్వ సెలవు కు బాట వేయడం ద్వారా, అభివృద్ధి చెందిన దేశాలు సైతంచేయలేనటువంటి ఒక పని ని చేయగలిగింది:  ప్రధాన మంత్రి

మానవహక్కుల కు ఏరి కోరి భాష్యాలు చెప్పవద్దు అంటూ హెచ్చరిక ను చేశారు

మానవహక్కుల ను రాజకీయాల పట్టకం నుంచి, రాజకీయపరమైనటువంటిలాభ నష్టాల కోణం లో నుంచి చూసినప్పుడు మానవ హక్కుల పరంగా అతి పెద్ద ఉల్లంఘన చోటుచేసుకొంటుంది:  ప్రధాన మంత్రి

హక్కులు మరియు విధులు అనేవి రెండు పట్టాల వంటివి; ఆ పట్టాల పైన మానవుల అభివృద్ధి, మానవుల గౌరవం అనే యాత్ర సాగుతుంది: ప్రధాన మంత్ర

Posted On: 12 OCT 2021 12:53PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం (ఎన్‌ హెచ్ఆర్‌ సి) 28వ స్థాపక దిన కార్యక్రమం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకొన్నారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశంలో మానవ హక్కుల తో పాటు, మానవీయ విలువల కు దేశ స్వాతంత్య్రోద్యమం, దేశ చరిత్ర లు ఒక గొప్ప ప్రేరణ ను అందించాయి అన్నారు. ‘‘ఒక దేశం గా, ఒక సమాజం గా మనం అన్యాయాన్ని, అఘాయిత్యాల ను ఎదిరించాం. మన హక్కుల కోసం శతాబ్దాల తరబడి పోరాటం చేశాం. ఎప్పుడైతే యావత్తు ప్రపంచం 1వ ప్రపంచ యుద్ధం తాలూకు హింస బారిన పడిందో ఆ కాలం లో భారతదేశం హక్కులు మరియు అహింసమార్గాన్ని సూచించింది అని ఆయన అన్నారు. మన బాపు ను మానవ హక్కుల ప్రతీక గాను, మానవ విలువల కు ప్రతీక గాను యావత్తు ప్రపంచం భావిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచం అనేక సందర్భాల లో అయోమయాని కి లోనై, భ్రమల లో చిక్కుకొందో భారతదేశం మాత్రం మానవ హక్కుల పట్ల అచంచలం గా, సంవేదన శీలం తో ఉండిందని ప్రధాన మంత్రి అన్నారు.

మానవ హక్కుల భావన అనేది పేదల గౌరవం తో అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని కలిగివుందని ప్రధాన మంత్రి అన్నారు. నిరుపేద ప్రజలు ప్రభుత్వ పథకాల లో ఒక సమానమైన వాటా ను పొందలేకపోయినప్పుడు హక్కుల తాలూకు ప్రశ్న ఉదయిస్తుంది అని ఆయన అన్నారు. పేదల గౌరవాని కి పూచీ పడడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయాసల ను గురించి ప్రధాన మంత్రి ఒక్కటొక్కటి గా వివరించారు. ఎప్పుడైతే ఒక పేద వ్యక్తి టాయిలెట్ సదుపాయాని కి నోచుకొన్నారో, ఆ వ్యక్తి బహిరంగ ప్రదేశాల లో మల మూత్రాదుల విసర్జన అగత్యాన్నుంచి బయటపడతారు, దానితో ఆ వ్యక్తి కి గౌరవాన్వితుడు అవుతారు అని ప్రధాన మంత్రి అన్నారు. అదే విధం గా ఒక బ్యాంకు లోపలకు వెళ్ళడానికి వెనుకంజ వేసేటటువంటి ఒక పేద మనిషి జన్ ధన్ ఖాతా ను కలిగి ఉంటే ఆ ఖాతా ఆ వ్యక్తి గౌరవానికి పూచీ పడుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. అదే తరహా లో రూపే కార్డు, ఉజ్జ్వల గ్యాస్ కనెక్షన్ లు, పక్కా ఇళ్ళ కు సంబంధించిన సంపత్తి హక్కు లు మహిళ ల పరం కావడం అనేవి ఈ దిశ లో పడినటువంటి ప్రధానమైన అడుగులు అంటూ ఆయన అభివర్ణించారు.

విభిన్న వర్గాల లో వేరు వేరు స్థాయిల లో జరుగుతున్న అన్యాయాన్ని తొలగించడానికి సైతం దేశం గత కొన్నేళ్ళ లో ప్రయత్నించిందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘దశాబ్దుల పాటు ముమ్మారు తలాక్ కు వ్యతిరేకం గా ఒక చట్టం కావాలి అంటూ ముస్లిమ్ మహిళ లు పట్టు పట్టుతూ వచ్చారు. ముమ్మారు తలాక్ కు వ్యతిరేకం గా ఒక చట్టాన్ని చేయడం ద్వారా ముస్లిమ్ మహిళల కు మేము కొత్త హక్కుల ను ఇచ్చాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. మహిళ ల కోసం అనేక రంగాల లో తలుపుల ను తెరవడం జరిగింది. మరి వారు అన్ని సమయాల లో సురక్షత ను కలిగివుంటూ పని చేసేటటువంటి వాతావరణాన్ని కల్పించడం జరిగింది అని ప్రధాన మంత్రి చెప్పారు. వృత్తి జీవనాన్ని గడిపే మహిళ ల కోసం 26 వారాల పాటు వేతనం తో కూడిన మాతృత్వ సెలవు లభించేటట్లు భారతదేశం చూసింది. ఈ ఘనమైన కార్యాన్ని అభివృద్ధి చెందిన దేశాలు సైతం సాధించలేకపోయాయి అని ఆయన అన్నారు. ఇదే మాదిరి గా, ట్రాన్స్-జెండర్స్, బాలలు, సంచార సముదాయాల వారి కోసం తీసుకు వచ్చిన నిర్ణయాల గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

ఇటీవల ముగిసిన పారాలింపిక్స్ లో పారా-ఎథ్ లీట్ ల స్ఫూర్తిదాయక ప్రదర్శన ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, దివ్యాంగ జనుల కోసం ఇటీవల కాలం లో చట్టాల కు రూపకల్పన చేయడం జరిగింది అన్నారు. వారికి కొత్త సదుపాయాల ను కల్పించడం జరిగింది. వారి కోసం భవనాల ను నిర్మించడమైంది. దివ్యాంగుల కంటూ ప్రత్యేకం గా ఒక భాష ను ప్రమాణికీకరించడమైంది కూడా అని ఆయన వివరించారు.

మహమ్మారి కాలం లో పేదల కు, అసహాయులైన వర్గాల కు, వయోవృద్ధుల కు ఆర్థిక సహాయాన్ని వారి వారి ఖాతాల లోకే నేరు గా అందించడం జరిగింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వన్ నేశన్-వన్ రేషన్ కార్డును అమలు లోకి తీసుకువచ్చినందువల్ల ప్రవాసీ శ్రమికుల కు ఎన్నో ఇబ్బందులు దూరమయ్యాయి అని ఆయన పేర్కొన్నారు.

మానవ హక్కుల కు ఏరి కోరి భాష్యం చెప్పకూడదు, అలాగే దేశం ప్రతిష్ట ను మసకబార్చడం కోసమని మానవ హక్కుల ను వినియోగించుకోరాదు అని ప్రధాన మంత్రి హెచ్చరిక చేశారు. ఈ మధ్య కొంత మంది వారి స్వప్రయోజనాల కోసం వారిదైన కోణం లో నుంచి మానవ హక్కుల కు భాష్యాన్ని చెప్పడం మొదలు పెట్టారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఏదైనా ఒక ఘటన లో మానవ హక్కుల ఉల్లంఘన ను గమనించే ధోరణి ని వ్యక్తం చేయడం, మరి అలాంటిదే రెండో ఘటన లో వారే వారి మునుపటి ధోరణి ని వ్యక్తం చేయకపోవడం అనేది మానవ హక్కుల కు ఎంతో నష్టాన్ని తెచ్చిపెడుతున్నదని ఆయన అన్నారు. మానవ హక్కుల ను రాజకీయాల పట్టకం లో నుంచి చూసినప్పుడు, వాటిని రాజకీయ లాభ నష్టాల కోణం లో నుంచి చూసినప్పుడు మానవ హక్కుల పరం గా అతి పెద్ద ఉల్లంఘన చోటు చేసుకొంటుంది అని కూడా ఆయన అన్నారు. ‘‘ఇలా ఆయా సందర్భాల లో ఎంపిక చేసుకొన్న రీతి న నడచుకోవడం అనేది ప్రజాస్వామ్యాని కి కూడా అంతే సమానమైన మేరకు నష్టాన్ని కొని తెస్తోంది’’ అంటూ ప్రధాన మంత్రి హెచ్చరిక స్వరాన్ని వినిపించారు.

మానవ హక్కు లు కేవలం హక్కుల తోనే సంబంధం కలిగినవి కాక అవి మన బాధ్యతల తో ముడిపడినటువంటివి కూడా ను అని గ్రహించడం ముఖ్యమని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘హక్కులు, బాధ్యత లు అనేవి రెండు పట్టా లు. ఆ పట్టాల పైనే మానవ అభివృద్ధి, మానవ గౌరవం పయనిస్తాయి. బాధ్యత లు అనేవి హక్కు ల మాదిరిగానే సమానమైన ప్రాముఖ్యాన్ని కలిగివుంటాయి. వాటి ని వేరు వేరు గా చర్చించ కూడదు, అవి ఒకదాని కి మరొకటి పూరకం గా ఉంటాయి’’ అని ఆయన అన్నారు.

 

 

రాబోయే తరాల మానవ హక్కుల ను గురించి ప్రస్తావిస్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ), నవీకరణ యోగ్య శక్తి లక్ష్యాలు, ఇంకా హైడ్రోజన్ మిశన్ ల వంటి చర్యల ను గరించి ఆయన నొక్కి చెప్తూ స్థిరమైనటువంటి జీవనాన్ని, పర్యావరణాని కి అనుకూలమైన వృద్ధి ని సాధించడం అనే దిశ లో భారతదేశం శరవేగం గా పయనిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.


 

 

 



(Release ID: 1763238) Visitor Counter : 192