ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డెన్మార్క్ ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కుదిరిన ఎంఓయులు, ఒప్పందాల జాబితా

Posted On: 09 OCT 2021 3:23PM by PIB Hyderabad
Sl.No. ఎంఓయు / ఒప్పందం వివ‌రాలు భార‌త‌దేశం త‌ర‌ఫున ప్రాతినిధ్యంవ‌హించిన‌వారు డెన్మార్క్ త‌ర‌ఫున ప్రాతినిధ్యంవ‌హించిన‌వారు

1

భూగ‌ర్భ జ‌లాల వ‌న‌రుల మ్యాపింగ్ కు సంబంధించి భార‌త‌దేశానికి డెన్మార్క్‌కు మ‌ధ్య‌న ఎంఓయు. ఇండియాకు చెందిన విజ్ఞాన శాస్త్ర మ‌రియు పారిశ్రామిక ప‌రిశోధ‌నా మండ‌లి- జాతీయ భూభౌతిక ప‌రిశోధ‌నా కేంద్రం, హైద‌రాబాద్ కు డెన్మార్క్ కు చెందిన ఆర్హ‌స్ విశ్వ‌విద్యాల‌యం, డెన్మార్క్ మ‌రియు గ్రీన్ లాండ్ ల‌కు చెందిన భౌగోళిక స‌ర్వే సంస్థ  ల‌కు మ‌ధ్య‌న ఈ అవ‌గాహ‌న ఒప్పందం ప‌త్రం కుదిరింది. 

డాక్ట‌ర్ వి.ఎం. తివారీ, డైరెక్ట‌ర్, సిఎస్ ఐఆర్‌- ఎన్ జిఆర్ ఐ, ఉప్ప‌ల్ రోడ్డు, హైద‌రాబాద్ ( తెలంగాణ‌)

ఆంబ్ ఫ్రెడ్డీ స్వానే

2

 ఇండియాకు చెందిన విజ్ఞాన‌శాస్త్ర మ‌రియు పారిశ్రామిక ప‌రిశోధ‌నా మండ‌లికి, డెన్మార్క్ కు చెందిన పేటెంట్ మ‌రియు ట్రేడ్ మార్క్ కార్యాల‌యానికి మ‌ధ్య‌న సంప్ర‌దాయ విజ్ఞాన డిజిట‌ల్ లైబ్ర‌రీని అందుబాటులోకి తెచ్చే ఒప్పందం. 

డాక్ట‌ర్ విశ్వ‌జ‌న‌ని జె. స‌త్తిగెరి, హెడ్‌, సిఎస్ ఐఆర్- సంప్ర‌దాయ విజ్ఞాన డిజిట‌ల్ లైబ్ర‌రీ విభాగం, 14, స‌త్సంగ్ విహార్ మార్గ్‌, న్యూఢిల్లీ

ఆంబ్ ఫ్రెడ్డీ స్వానే

 

3

ఉష్ణ‌మండ‌ల వాతావ‌ర‌ణంలో స‌హ‌జ శీత‌లీక‌ర‌ణ ప‌రిక‌రాల‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి వీలుగా ఉన్న‌త‌స్థాయి సంస్థ‌ను ఏర్పాటు చేయ‌డానికిగాను బెంగ‌ళూరులోని భార‌తీయ విజ్ఞాన‌శాస్త్ర సంస్థ‌కు, డెన్మార్క్ కు చెందిన డాన్ ఫాస్ ఇండ‌స్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు మ‌ధ్య‌న ఎంఓయు. 

 

ఆచార్య గోవింద‌న్ రంగ‌రాజ‌న్‌, డైరెక్ట‌ర్, ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌, బెంగ‌ళూరు. 

 

శ్రీ ర‌విచంద్ర‌న్ పురుషోత్త‌మ‌న్‌, అధ్యక్షులు, డాన్ ఫాస్ ఇండియా

4

భార‌త‌దేశానికి చెందిన నైపుణ్యాభివృద్ధి మ‌రియు పారిశ్రామిక ప్రోత్సాహ‌క మంత్రిత్వ‌శాఖ‌కు డెన్మార్క్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య‌న జాయింట్ లెట‌ర్ ఆఫ్ ఇంటెంట్‌. 

శ్రీ రాజేష్ అగ‌ర్వాల్‌, కార్య‌ద‌ర్శి, నైపుణ్యాభివృద్ధి మ‌రియు పారిశ్రామ ప్రోత్సాహ‌క మంత్రిత్వ‌శాఖ‌

ఆంబ్ ఫ్రెడ్డీ స్వానే

     

 

 

పైవాటితోపాటు కింద తెలిపిన వాణిజ్య ఒప్పందాల‌ను కూడా ప్ర‌క‌టించారు. 

.

హైడ్రోజ‌న్ ఎల‌క్ట్రోలైజ‌ర్ ను అభివృద్ధి చేయ‌డంపైనా, అనంత‌రం ఇండియాలో దాని త‌యారీ, అందుబాటును చేప‌ట్ట‌డంపైనా రిల‌య‌న్స్ ఇండిస్ట్రీస్ లిమిటెడ్‌కు,స్టైస్ డాల్ ఫ్యూయ‌ల్ టెక్నాల‌జీ సంస్థ‌ల‌కు మ‌ధ్య‌న ఎంఓయు. 

బి.

డెన్మార్క్ లో సుస్థిర‌త్వ ప‌రిష్కారాల‌నందించే ఉన్న‌త‌స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డానికి సంబంధించి ఇన్ఫోసిస్ టెక్నాల‌జీస్‌, ఆర్హ‌స్ విశ్వ‌విద్యాల‌యానికి మ‌ధ్య‌న ఎంఓయు. 

 

సి.

ఆర్ధిక‌రంగంలో హ‌రిత మార్పును సాధించ‌డానికి సంబంధించి ప‌రిశోధ‌న‌లు చేయ‌డానికిగాను అవ‌స‌ర‌మైన విజ్ఞాన మార్పిడిలో వ్యూహాత్మ‌క స‌హ‌కారంపైన అబ్జ‌ర్వ‌ర్ రీసెర్చ్ ఫౌండేష‌న్ మ‌రియు స్టేట్ ఆఫ్ గ్రీన్ సంస్థ‌ల‌కు మ‌ధ్య‌న ఎంఓయు. 

 

***


(Release ID: 1762787) Visitor Counter : 187