హోం మంత్రిత్వ శాఖ

కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా శనివారం ఢిల్లీలో చారిత్రాత్మక ఎర్ర కోట నుండి ఆజాదీకా అమృత్‌మహోత్సవ్‌లో భాగంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ)ల ఆల్ ఇండియా కార్ ర్యాలీ 'సుదర్శన్ భారత్ పరిక్రమ'ను జెండా ఊపి ప్రారంభింస్తారు.


దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దండి, ఈశాన్య మరియు లేహ్ నుండి కన్యాకుమారి వరకు ప్రారంభమైన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్‌) సైకిల్ ర్యాలీలను శ్రీ అమిత్ షా స్వాగతించారు. ఇవి శనివారం న్యూఢిల్లీలో ముగుస్తుంది

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం అమరవీరులు మరియు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడానికి మరియు యువతను ప్రేరేపించడానికి ఆజాదీకా అమృత మహోత్సవాన్ని జరుపుకుంటుంది.

ఈ కార్యక్రమానికి టోక్యో ఒలింపిక్ మెడిలిస్ట్‌లు శ్రీ నీరజ్ చోప్రా, శ్రీ రవి కుమార్ దహియా మరియు శ్రీ భజరంగ్ పునియా గౌరవ అతిథులుగా హాజరవుతారు

7,500 కిలోమీటర్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్‌ఎస్‌జీ కారు ర్యాలీ దేశంలోని 18 రాష్ట్రాలలోని స్వాతంత్ర ఉద్యమం మరియు స్వాతంత్ర్య సమరయోధులతో సంబంధం ఉన్న ముఖ్యమైన మరియు చారిత్రక ప్రదేశాల గుండా వెళుతుంది. అక్టోబర్ 30 న న్యూఢిల్లీలోని పోలీసు మెమోరియల్ వద్ద యాత్ర ముగుస్తుంది.

ఆగష్టు 15 న ప్రారంభమైన సిఎపిఎఫ్‌ల సైకిల్ ర్యాలీల్లో ఆఫీసర్‌లు మరియు జవాన్లతో సహా దాదాపు 900 మంది సైక్లిస్టులు 21 వ స్థానంలో ఉన్నారు.

Posted On: 01 OCT 2021 3:36PM by PIB Hyderabad

కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా శనివారం ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుండి జాతీయ భద్రతా గార్డ్ (ఎన్‌ఎస్‌జి)ల 'సుదర్శన్ భారత్ పరిక్రమ' ఆల్ ఇండియా కార్ ర్యాలీని ప్రారంభిస్తారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవం' సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రారంభమైన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్‌ల) సైకిల్ ర్యాలీలను కూడా శ్రీ అమిత్ షా జెండా ఊపి ప్రారంభిస్తారు. దండి, ఈశాన్యం మరియు లేహ్ టు కన్యాకుమారి చేపట్టిన యాత్రలు న్యూఢిల్లీలో ముగుస్తాయి. టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు శ్రీ నీరజ్ చోప్రా, శ్రీ రవి కుమార్ దహియా మరియు శ్రీ భజరంగ్ పునియా కూడా ఈ కార్యక్రమంలో అతిథులుగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు మరియు పోలీసు దళాలు ముఖ్య అధికారులు కూడా పాల్గొంటారు.

నేటి యువతలో అమరవీరులు మరియు స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని నింపడానికి మరియు వారి త్యాగాలను స్మరించుకోవడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటుంది. 7,500 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్‌ఎస్‌జీలకారు ర్యాలీ దేశంలోని స్వాతంత్ర్య ఉద్యమం మరియు స్వాతంత్ర్య సమరయోధులతో సంబంధం ఉన్న ముఖ్యమైన మరియు చారిత్రక ప్రదేశాల గుండా వెళుతుంది. అక్టోబర్ 30, 2021న న్యూఢిల్లీలోని పోలీసు స్మారక చిహ్నంవద్ద ముగుస్తుంది. ఎన్‌ఎస్‌జి కారు ర్యాలీ దేశంలోని 12 రాష్ట్రాల్లోని 18 నగరాల గుండా వెళుతుంది. కకోరి మెమోరియల్ (లక్నో), భారత మాతా మందిర్ (వారణాసి), నేతాజీ భవన్ బరాక్‌పూర్ (కోల్‌కతా), స్వరాజ్ ఆశ్రమం (భువనేశ్వర్), తిలక్ ఘాట్ (చెన్నై), ఫ్రీడమ్ పార్క్ (బెంగళూరు), మణి భవన్ / ఆగస్టు క్రాంతి మైదాన్ (ముంబై) మరియు సబర్మతి ఆశ్రమం (అహ్మదాబాద్) వంటి చారిత్రాత్మక ప్రదేశాల గూడా ఈ ర్యాలీ సాగుతుంది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థం కేంద్ర సాయుధ భద్రతా దళాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైకిల్ ర్యాలీలను నిర్వహించాయి. సిఎపిఎఫ్‌ల సైకిల్ ర్యాలీలు ఆగష్టు 15 న ఆఫీసర్‌లు మరియు జవాన్లతో సహా సుమారు 900 మంది సైక్లిస్టులు 21 రాష్ట్రాల గుండా 41,000 కిలోమీటర్ల దూరాన్ని చేరుకున్నారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు ఒక సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నాలుగు, శాస్ర్త సీమ బాల్ పది ర్యాలీలు, అస్సాం రైఫిల్స్ ఒకటి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తొమ్మిది ర్యాలీలు మరియు సరిహద్దు భద్రతా దళం పదిహేను సైకిల్ ర్యాలీలు నిర్వహించారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ర్యాలీల లక్ష్యం దేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని 'ఆజాదీ కా అమృత్ మహోత్సవం' గా జరుపుకోవడం అలాగే స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను సందర్శించడం ద్వారా పరస్పర సోదరత్వ సందేశాన్ని వ్యాప్తి చేయడం. యువతను కలుసుకోవడం ద్వారా దేశ ఐక్యత మరియు సమగ్రతను కాపాడటం మరియు దేశభక్తి కోసం వారిని ప్రేరేపించడం, స్వాతంత్య్రోద్యమం యొక్క దేశభక్తులు మరియు అమరవీరులకు నివాళులు అర్పించడం మరియు పౌరులు మరియు యువతలో జాతీయ సమైక్యత, దేశభక్తి మరియు సోదరభావం యొక్క స్ఫూర్తిని బలోపేతం చేయడం.


 

*****



(Release ID: 1760114) Visitor Counter : 204