ప్రధాన మంత్రి కార్యాలయం
సెప్టెంబర్ 30 న సిఐపిఇటి: ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ, జయ్ పుర్ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
ప్రధానమంత్రి రాజస్థాన్ లో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు శంకుస్థాపన కూడా చేయనున్నారు
Posted On:
29 SEP 2021 12:50PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 30న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సిపెట్ (సిఐపిఇటి): ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ,జయ్ పుర్ ను ప్రారంభించి, రాజస్థాన్ లోనే బాంస్ వాడా, సిరోహీ, హనుమాన్ గఢ్, ఇంకా దౌసా జిల్లాల లో నాలుగు కొత్త వైద్య కళాశాల లకు శంకుస్థాపన చేయనున్నారు.
‘‘జిల్లా/రెఫరల్ హాస్పిటల్స్ కు అనుబంధం గా ఉండే కొత్త మెడికల్ కాలేజీల ను ఏర్పాటు చేయడం’’ కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకం లో భాగం గా ఈ వైద్య కళాశాలల ను మంజూరు చేయడమైంది. వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం లో వెనుకబడిన జిల్లాల కు, ఆకాంక్షభరిత జిల్లాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోంది. ఈ పథకం లో మూడు దశల లో దేశవ్యాప్తం గా 157 నూతన వైద్య కళాశాలలకు ఆమోదం తెలపడమైంది.
సిపెట్ ను గురించి
రాజస్థాన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలసి సిపెట్: ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ, జయ్ పుర్ ను ఏర్పాటు చేశాయి. ఈ కళాశాల స్వయం సంవృద్ధియుతమైంది. అంతేకాదు, పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ అవసరాల ను, పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ తో సంబంధం గల పరిశ్రమ ల అవసరాల ను తీర్చడం కోసమే ఇది అంకితం అయింది. యువతీ యువకులు చేయి తిరిగిన సాంకేతిక వృత్తి నిపుణులు గా మారేందుకు వారికి తగిన విద్య ను ఈ సంస్థ బోధిస్తుంది.
కేంద్ర మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవియా తో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గహ్ లోత్ కూడా ఈ సందర్భం లో పాలుపంచుకోనున్నారు.
***
(Release ID: 1759285)
Visitor Counter : 241
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam