రక్షణ మంత్రిత్వ శాఖ
కుటుంబ పెన్షన్ పొందేందుకు దివ్యాంగులైన ఇతర ఆధారితుల ఆదాయ పరిమితి పెంచిన ప్రభుత్వం
Posted On:
28 SEP 2021 3:01PM by PIB Hyderabad
ప్రధానాంశాలు:
- మానసిక లేదా శారీరక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు/తోబుట్టువుల కుటుంబ పెన్షన్ పొందేందుకు గల ఆదాయ పరిమితిని పెంచిన ప్రభుత్వం.
- కుటుంబ పెన్షన్ పొందడం కోసం మానసిక లేదా శారీరక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు/ తోబుట్టువుల ఆర్హత ఆదాయ పరిమితిని కుటుంబ పెన్షన్ కాకుండా డియర్‌నెస్ రిలీఫ్‌తో పాటు ఇతర వనరుల నుండి నెలకు రూ.9000ల నుంచి స్థాయి నుంచి పెంచడమైంది
మానసిక లేదా శారీరక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు/తోబుట్టువులకు కుటుంబ పెన్షన్ మంజూరునకు తగిన ఆదాయ ప్రమాణాలను పెంచాలని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తాజా పెంపు నిర్ణయం ప్రకారం కుటుంబ పెన్షన్ కాకుండా ఇతర వనరుల నుండి అతని/ఆమె మొత్తం ఆదాయం.. సాధారణ పెన్షన్ కంటే అర్హత కలిగిన కుటుంబ పెన్షన్ కంటే తక్కువగా ఉంటే, అలాంటి మరణించిన ప్రభుత్వ ఉద్యోగి డ్రా చేసిన చివరి వేతనంలో 30% మొత్తాన్ని జీవితాంతం కుటుంబ పెన్షన్‌గా పొందేందుకు సంబంధితులు అర్హులు. అటువంటి సందర్భాలలో ఆర్థిక ప్రయోజనం 08.02.2021 నుండి అమలులోకి వస్తుంది. తాజా నిర్ణయం తీసుకోక ముందు డియర్నెస్ రిలీఫ్‌తో పాటు కుటుంబ పెన్షన్ కాకుండా ఇతర వనరుల నుండి వచ్చే నెలవారీ ఆదాయం రూ. 9,000/- లకు మించకుండా ఆదాయాన్ని ఉన్నప్పుడు మాత్రమే సంబంధితి ఉద్యోగికి చెందిన పిల్లులు, దివ్యాంగులు/తోబుట్టువులు కుటుంబ పెన్షన్ కోసం అర్హులు.
***
(Release ID: 1759103)
Visitor Counter : 239