ప్రధాన మంత్రి కార్యాలయం

క్వాడ్ శిఖర సమ్మేళనం ప్రారంభ ఘట్టం లో ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యలు

Posted On: 25 SEP 2021 4:46AM by PIB Hyderabad

అధ్య‌క్షుడు శ్రీ బైడెన్‌,

ప్ర‌ధాని శ్రీ మారిస‌న్,

ప్ర‌ధాని శ్రీ సుగా.

ఒకటో ముఖాముఖి క్వాడ్ సమిట్ తాలూకు చారిత్రిక చొరవ కు గాను అధ్య‌క్షుడు శ్రీ బైడెన్ కు చాలా చాలా ధన్యవాదాలు. మన నాలుగు దేశాలు 2004 వ సంవత్సరం లో సునామీ సంభవించిన త‌రువాత ఇండో- ప‌సిఫిక్ ప్రాంతాని కి స‌హాయం చేయ‌డం కోసం కలసికట్టు గా ముందుకు వ‌చ్చాయి. ఈ రోజు న ప్రపంచం కోవిడ్-19 మ‌హ‌మ్మారి తో పై పోరాటం చేస్తున్న ఈ కాలం లో క్వాడ్ రూపం లో మ‌నం మ‌రొక్క సారి చేతులు క‌లిపి, మాన‌వాళి శ్రేయానికై కృషి చేస్తున్నాం.

మన క్వాడ్ టీకా కార్య‌క్ర‌మం ఇండో- ప‌సిఫిక్ ప్రాంత దేశాల‌కు భారీ ఎత్తున సాయపడనుంది. క్వాడ్ త‌న ఉమ్మ‌డి ప్ర‌జాస్వామిక విలువ‌ ల ఆధారం గా స‌వ్య‌మైన ఆలోచ‌న తో, స‌వ్య దృక్ప‌థం తో ముంద‌డుగు వేయాల‌ని నిర్ణ‌యించుకొంది.

స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ లు కావ‌చ్చు, ప్ర‌పంచ భ‌ద్ర‌త‌ కావ‌చ్చు, జలవాయు సంబంధి కార్యాలు కావ‌చ్చు, లేదా కోవిడ్-19 సంబంధి ప్రతిస్పందన కావ‌చ్చు, లేదా మరి సాంకేతిక‌ విజ్ఞ‌ానం సంబంధి సహకారం కావచ్చు.. ఈ అన్ని విషయాల లో నేను నా స‌హ‌చ‌రుల‌ తో చ‌ర్చ‌లో పాలుపంచుకోవడం వల్ల నాకు చాలా సంతోషం కలుగుతుంది.

మన క్వాడ్ ఒక విధం గా ‘‘ప్ర‌పంచ హితం కోసం పాటుపడే ఒక దళం’’గా త‌న పాత్ర‌ ను పోషించనుంది. క్వాడ్ లో మ‌న స‌హ‌కారం ఇండో- ప‌సిఫిక్ ప్రాంతం లోను, ప్ర‌పంచ వ్యాప్తం గాను శాంతి కి, సంవృద్ధి కి పూచీ పడుతుందన్న నమ్మకం నాకు ఉంది.

మీకు ఇవే ధన్యవాదాలు.

(అస్వీకరణ: ఇది ప్ర‌ధాన మంత్రి ప్రసంగానికి రమారమి అనువాదం. సిసలు ప్రసంగం హిందీ భాష లో సాగింది.)

 

 

***



(Release ID: 1758435) Visitor Counter : 140