ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

"గులాబ్" తుపాను సంసిద్ధతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 26 SEP 2021 3:50PM by PIB Hyderabad

"గులాబ్" తుపాను నేపథ్యంలోప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి, ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని  ఆయన హామీ ఇచ్చారు. 

ఈ విషయాన్ని ఒక ట్వీట్ ద్వారా తెలియజేస్తూ- "గులాబ్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ తో మాట్లాడి పరిస్థితుల గురించి తెలుసుకున్నాను. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందిస్తామని ఆయనకు హామీ ఇచ్చాను. తుపాను కారణంగా ఎవరికీ ఎలాంటి ముప్పు కలగరాదని, అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1758302) आगंतुक पटल : 281
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam