కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

టెలికాం సంస్కరణలు ప్రారంభించిన టెలికాం శాఖ; కేవైసి విధానం సరళీకృతం

Posted On: 21 SEP 2021 8:03PM by PIB Hyderabad

"టెలికాం సంస్కరణలు అట్టడుగు వర్గాల కోసం ప్రపంచ స్థాయి ఇంటర్నెట్, టెలీ-కనెక్టివిటీని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి." అని కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఇటీవల చెప్పినట్లు ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక ప్రధాన అడుగు పడింది. కేంద్ర టెలికమ్యూనికేషన్లు, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, కేవైసి ప్రక్రియలను సరళీకృతం చేస్తూ తద్వారా 15.09.2021 న క్యాబినెట్ ప్రకటించిన టెలికాం సంస్కరణలను ప్రారంభించడానికి పలు ఆదేశాలను జారీ చేసింది.

ప్రస్తుతం, సబ్‌స్క్రైబర్  కేవైసి ప్రక్రియకు లోబడి ఉండాలి, ఇది కొత్త మొబైల్ కనెక్షన్ పొందడానికి లేదా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పిడికి కానీ గుర్తింపు మరియు చిరునామాకి సంబంధించిన అసలు డాక్యుమెంట్‌లతో పాటు పాయింట్ ఆఫ్ సేల్‌ని సందర్సించాలి. 

ఆన్ లైన్ పధ్ధతి ఇటీవలి కాలంలో ఆమోదయోగ్యమైన ప్రమాణంగా మారింది. ఓటిపి ప్రామాణీకరణతో చాలా కస్టమర్ సేవలు ఇంటర్నెట్ ద్వారా అందిస్తున్నారు. కోవిడ్ యుగంలో కాంటాక్ట్‌లెస్ సేవలను చందాదారుల సౌలభ్యం కోసం మరియు వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. 

ఆధార్ ఉపయోగించినపుడు, జనాభా వివరాలను యుఐడిఏఐ నుండి ఎలక్ట్రానిక్‌గా పొందినట్లయితే కస్టమర్ సమ్మతి తప్పనిసరి చేయడం జరిగింది.

దీని ప్రకారం, కాంటాక్ట్‌లెస్, కస్టమర్ సెంట్రిక్ మరియు సెక్యూర్డ్ కేవైసి ప్రక్రియలను అమలు చేయడానికి డిఓటి ద్వారా తక్షణ అమలు కోసం కింది ఆదేశాలు జారీ అయ్యాయి: 

  1. ఆధార్ ఆధారిత ఈ-కేవైసి: 

కొత్త మొబైల్ కనెక్షన్ల జారీ కోసం ఆధార్ ఆధారిత ఇ-కెవైసి ప్రక్రియ తిరిగి ప్రవేశపెట్టారు. యుఐడిఏఐ ద్వారా ప్రతి కస్టమర్ ప్రమాణీకరణకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు రూ. 1/- ఛార్జి ఉంటుంది. ఇది పూర్తి కాగితారహిత, డిజిటల్ ప్రక్రియ, దీనిలో డెమోగ్రాఫిక్ వివరాలను కస్టమర్ చిత్రంతో పాటు  యుఐడిఏఐ నుండి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (టిఎస్పి లు) ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు.

 

  1. సొంతంగా కేవైసి :

ఈ ప్రక్రియలో, వినియోగదారులకు మొబైల్ కనెక్షన్ జారీ చేయడం అనేది యాప్/పోర్టల్ ఆధారిత ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది, దీనిలో కస్టమర్ ఇంట్లో/ఆఫీసులో కూర్చొని మొబైల్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, యుఐడిఏఐ  లేదా డిజిలాకర్ ను ఎలక్ట్రానిక్ ద్వారా ధృవీకరించబడిన పత్రాలను ఉపయోగించి అతని ఇంటి వద్ద సిమ్ పంపిణీ చేస్తారు.

 

  1. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌కు అటు ఇటు మార్పిడికి మొబైల్ కనెక్షన్ ఓటీపీ ఆధారిత విధానం: 

ఓటీపీ ఆధారిత మార్పిడి ప్రక్రియ అమలు చేయడం వలన చందాదారుడు తన మొబైల్ కనెక్షన్‌ని ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కి కానీ, అటు నుండి ఇటు కానీ మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది మరియు ఓటీపీ ఆధారిత ప్రామాణీకరణ ద్వారా ఇంట్లో/ఆఫీసులో కూర్చొని ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

 

పూర్తి వివరాల ఆదేశాలను డాట్ వెబ్ సైట్ లో  అప్ లోడ్ చేయడం జరిగింది (Link-https://dot.gov.in/relatedlinks/telecom-reforms-2021).

 

***

 (Release ID: 1757426) Visitor Counter : 189