ప్రధాన మంత్రి కార్యాలయం

గోవా లో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తో మాట్లాడిన ప్రధాన మంత్రి  


వయోజనుల కు అందరికీ ఒకటో డోసు ను పూర్తి చేసినందుకు గోవా ను ఆయనప్రశంసించారు  

శ్రీ మనోహర్ పర్రికర్ అందించిన సేవల ను ఈ సందర్బం లో ప్రధాన మంత్రిగుర్తు కు తెచ్చుకొన్నారు  

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, ఇంకా సబ్ కాప్రయాస్’ తాలూకు గొప్ప ఫలితాల ను గోవాచాటిచెప్పింది: ప్రధాన మంత్రి  

పుట్టిన రోజులు చాలానే వచ్చాయి, మరి నేను ఎల్లప్పుడూ ఇటువంటి వాటి కి దూరం గా ఉన్నాను, కానీ  నా ఇన్నేళ్ళ ఆయుష్సు లోనిన్నటి రోజు నన్ను చాలా భావుకుని గా చేసివేసింది ఎందుకంటే 2.5 కోట్ల మంది కి టీకాల ను ఇవ్వడమైంది: ప్రధాన మంత్రి 

నిన్న ప్రతి గంట కు 15 లక్షల కు పైగాడోసులు, ప్రతి నిమిషాని కి 26 వేల కు పైగా డోసు లు మరి ప్రతి సెకను లోను 425 కంటే ఎక్కువ డోసుల ను వేయడం జరిగింది: ప్రధాన మంత్రి  

‘ఏక్ భారత్ -శ్రేష్ఠ్ భారత్’ అనే భావన ను ప్రతిబింబించే గోవా యొక్క ప్రతి కార్యసాధన నన్ను ఎంతోఆనందం తో నింపివేస్తుంది: ప్రధాన మంత్రి 

గోవా ఈ దేశం లో ఓ రాష్ట్రం మాత్రమే కాదు, అది బ్రాండ్ ఇండియా తాలూకు బలమైనసంకేతం కూడాను: ప్రధాన మంత్రి


Posted On: 18 SEP 2021 12:40PM by PIB Hyderabad

గోవా లో వయోజన జనాభా కు ఒకటో డోసు ను 100 శాతం వేయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అక్కడి ఆరోగ్య సంరక్షణ కార్మికుల తోను, కోవిడ్ టీకా కార్యక్రమం లబ్ధిదారుల తోను మాట్లాడారు.

ఆరోగ్య సంరక్షణ కార్మికులు మరియు లబ్ధిదారుల తో మాటామంతీ

కోవిడ్ టీకాల ను వేయించుకోవలసింది గా ప్రజల ను ఎలా ఒప్పించారు? అంటూ గోవా మెడికల్ కాలేజీ లో లెక్చరర్ డాక్టర్ నితిన్ ధూప్‌దలే ను ప్రధాన మంత్రి అడిగారు. ఆయన కోవిడ్ టీకాకరణ ప్రచార ఉద్యమానికి, ఇదివరకటి ప్రచార ఉద్యమానికి మధ్య వ్యత్యాసాన్ని గురించి కూడా చర్చించారు. ఈ ప్రత్యేక ప్రచార ఉద్యమం ఒక మిశన్ మోడ్ ఉద్యమం లా కొనసాగడాన్ని డాక్టర్ ధూప్‌దలే ప్రశంసించారు. ప్రధాన మంత్రి ప్రతిపక్ష దళాన్ని విమర్శిస్తూ, 2.5 కోట్ల మంది కి టీకామందు ను వేయించిన తరువాత టీకాలను వేయించుకొన్న వారికి బదులు ప్రతిపక్ష దళం నుంచి వచ్చిన ప్రతిస్పందన ఏ విధం గా వచ్చిందనే అంశం పై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గోవా లో వయోజన జనాభా కు ఒకటో డోసు ను 100 శాతం కవరేజీ ని పూర్తి చేసినందుకు వైద్యులను, ఇతర కరోనా యోధుల ను మెచ్చుకొన్నారు. ఇది యావత్తు ప్రపంచాని కి ఒక ప్రేరణ అని ఆయన అన్నారు.

 

కోవిడ్ లబ్ధిదారు, కార్యకర్త శ్రీ నజీర్ శేఖ్ తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఆయన ఇతరుల ను టీకా

వేయించుకోవలసింది గా ప్రేరేపిపంచే నిర్ణయాన్ని ఎలా తీసుకొన్నారు? అంటూ అడిగారు. ప్రజల ను టీకా కేంద్రాల వద్దకు తీసుకుపోవడం లో ఎదురవుతున్న ఇబ్బందుల ను గురించి ఆయన శ్రీ నజీర్‌ ను వాకబు చేశారు. టీకాకరణ ప్రచార ఉద్యమం లో శ్రీ నజీర్ అనుభవాన్ని గురించి కూడా ఆయన ఆరా తీశారు. శ్రీ నజీర్ శేఖ్ ప్రయత్నం మాదిరి గానే సబ్ కా ప్రయాస్కు పూనుకోవడం ఈ అత్యంత ముఖ్యమైన ప్రచార ఉద్యమం లో ఫలితాల ను సాధించడానికి ఒక పెద్ద కారణం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రధాన మంత్రి దేశవ్యాప్తం గా సామాజిక స్పృహ కల కార్యకర్తల ను ప్రశంసించారు.

 

సీమా ఫర్నాండిజ్‌తో ప్రధాన మంత్రి ముచ్చటిస్తూ, ప్రజలు టీకా కోసం ఆమె వద్ద కు వచ్చినప్పుడు ఆమె వారిని ఏమేమి అడిగిందీ చెప్పాలని కోరారు. ఆమె కోల్డ్ చైన్ ను నిర్వహించిన దశల ను గురించి వివరించారు. కోల్డ్ చైన్ ను వారు ఎలాగ నిర్వహించారంటూ కూడా ప్రధాన మంత్రి ఆరా తీశారు. టీకా లు వృథా పోకుండా చూడడానికని చేపట్టిన చర్యల ను గురించి కూడా ఆయన అడిగారు. కుటుంబ కట్టుబాటులు ఉన్నప్పటికీ ఆమె తన విధుల ను నిర్వర్తించినందుకు గాను ఆమె ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఆవిడ ప్రయాసలకు గాను కరోనా యోధుల కుటుంబాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 

శ్రీ శశికాంత్ భగత్‌ తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, నిన్న తన పుట్టిన రోజు న తన పాత పరిచయస్తుని తో తాను ఎలా సంభాషించిందీ ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. తనను తన వయస్సు విషయమై అడిగినప్పుడు ఇంకా 30 (ఏళ్లు) బాకీ ఉన్నాయిఅని బదులిచ్చినట్లు ప్రధాన మంత్రి వివరించారు. శ్రీ మోదీ 25 ఏళ్ల శ్రీ భగత్‌ కు 75 ఏళ్ల ను గురించి ఆలోచించవద్దని, రాబోయే 25 సంవత్సరాల మీద దృష్టి పెట్టవలసిందని సూచించారు. టీకాకరణ వేళ లో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగారు. శ్రీ భగత్ జవాబిస్తూ, వయో వృద్ధుల కు ఇస్తున్న ప్రాధాన్యం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను మధుమేహం తో బాధ పడుతున్నానని, తనకు ఎటువంటి దుష్ప్రభావం ఎదురవలేదని చెప్పి టీకా వల్ల దుష్ప్రభావాలు ఉంటాయేమోనన్న అనుమానాల ను కూడా తొలగించారు. పదవీవిరమణ పొందిన సేల్స్ టాక్స్ ఆఫీసరు శ్రీ భగత్ సామాజిక సేవను చేస్తున్నందుకు గాను ఆయన ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వం పన్ను ల రంగం తో సహా జీవింయడం లో సౌలభ్యాన్ని పెంచడానికి కట్టుబడి ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

స్వీటీ ఎస్‌ఎమ్ వెంగుర్‌లేకర్‌ ను ఆమె సుదూర ప్రాంతాల లో టీకా ఉత్సవాన్ని ఎలా నిర్వహించగలిగారంటూ ప్రధాన మంత్రి అడిగారు. ఉత్సవాన్ని నిర్వహించడం కోసం సిద్ధం చేసిన ప్రణాళిక ను గురించి ఆయన తెలుసుకోగోరారు. మహమ్మారి కాలం లో దీనిని సాధ్యమైనంత వరకు సులభతరం గా మార్చడం పై దృష్టి ని కేంద్రీకరించాలి అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఇటువంటి విస్తృత ప్రయోగం లో భాగం అయిన పత్రాలను సరి అయిన రీతి లో భద్రపరచాలని, లాజిస్టిక్స్ తాలూకు సమాచారాన్ని అవసరమైన వర్గాల కు అందజేయాలని ఆయన కోరారు.

 

చూపుడు శక్తి లోపం తో బాధ పడుతున్న లబ్ధిదారు సుమేరా ఖాన్ ను ఆమె టీకా ను వేయించుకొన్న తాలూకు అనుభవం ఎలా ఉందని ప్రధాన మంత్రి అడిగారు. చదువుల లో ఖాన్ సాధించిన విజయాల కు గాను ఆమె ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఐఎఎస్ అధికారి కావాలన్న ఆమె ఆకాంక్షలు నెరవేరాలి అంటూ ఆయన శుభకామనల ను వ్యక్తం చేశారు. ఆమె తాను నడుస్తున్న తరహా లోనే దేశం లోని దివ్యాంగ పౌరుల ను సైతం నడచేటట్టు గా ప్రేరణ ను అందిస్తున్నందుకు గాను శ్రీ మోదీ ప్రశంసించారు.

 

 

 

ప్రధాన మంత్రి ప్రసంగం

 

కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, శుభ్ గణేశ్ ఉత్సవ కాలం లో అనంత సూత్ర (సురక్ష) ను సాధించినందుకు గాను గోవా ప్రజల ను ప్రశంసించారు. గోవా లో అర్హత ఉన్న వారంతా టీకా మందు తాలూకు కనీసం ఒక డోసు ను తీసుకొన్నందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘కరోనా పై పోరాటం లో ఇది ఒక ప్రధానమైన కార్యసిద్ధి గా ఉంది. ఏక్ భారత్ -శ్రేష్ఠ్ భారత్ అనే భావన ను ప్రతిబింబించే గోవా తాలూకు ప్రతి కార్యసాధన నన్ను ఆనందం లో నింపివేస్తుందిఅని ఆయన అన్నారు.

 

ప్రముఖ విజయాల ను అందించిన ఈ రోజు న శ్రీ మనోహర్ పర్రికర్ సేవల ను ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు.

 

గత కొన్ని నెలల్లో, గోవా భారీ వర్షం, చక్రవాతం, వరద ల వంటి ప్రాకృతిక విపత్తుల తో ధైర్యం గా పోరాడింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రాకృతిక ఆపద ల మధ్య కరోనా టీకాకరణ ను వేగం గా కొనసాగించినందుకు గాను కరోనా యోధుల ను, ఆరోగ్య కార్మికుల ను, టీమ్ గోవా ను ఆయన ప్రశంసించారు.

 

సామాజిక సవాళ్ల ను, భౌగోళిక సవాళ్ల ను ఎదుర్కోవడం కోసం

గోవా ప్రదర్వించిన సమన్వయాన్ని ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. రాష్ట్రం లో దూర, సుదూర ప్రాంతాల లో ఉన్న కెనాకోనా సబ్ డివిజన్‌ లో సైతం వేగం గా జరిగిన టీకాకరణ కార్యక్రమం రాష్ట్రం లో మిగతా ప్రాంతాల కు ఒక ఉదాహరణ ను అందించింది అని ఆయన అన్నారు. ‘‘గోవా సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్తాలూకు గొప్ప ఫలితాల ను కనబరచింది’’ అని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి ఈ సందర్భం లో కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘నేను చాలా పుట్టిన రోజుల ను చూశాను, మరి నేను ఇటువంటి వాటి విషయం లో దూరం గా ఉంటూ వచ్చాను, కానీ నా జీవనం లో నిన్నటి రోజు నన్ను ఎంతో భావోద్వేగాని కి గురిచేసిన రోజు గా మారింది. దేశం, కరోనా యోధుల ప్రయత్నాల తో నిన్నటి రోజు ను మరింత ముఖ్యమైంది గా మార్చివేసింది.’’ అని ఆయన అన్నారు. 2.5 కోట్ల మంది కి టీకాలను ఇప్పించేందుకు జట్టు తరఫున మంది తరఫు న ప్రదర్శించినటువంటి కరుణ, సేవ, కర్తవ్య భావనల ను ఆయన ప్రశంసించారు. ‘‘అందరూ పూర్తి గా సహకరించారు, మంది ఈ కార్యక్రమాన్ని సేవ తో జోడించారు. వారి ఈ కరుణ, కర్తవ్యాలతోనే ఒక్క రోజు లో 2.5 కోట్ల మంది కి టీకామందు ఇప్పించడం సాధ్యపడిందిఅని ప్రధాన మంత్రి అన్నారు.

 

గత రెండు సంవత్సరాలు గా తలమునకలు గా ఉన్న వైద్య చికిత్స రంగం లోని వారు వారి ప్రాణాల ను గురించి అయినా పట్టించుకోకుండా కరోనా పై పోరాటం సలపడం లో దేశ ప్రజల కు సహాయపడుతున్నారు, వారి తోడ్పాటు ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ‘‘వారు నిన్న ఏ విధం గా అయితే టీకా ను ఇప్పించడం లో రికార్డు ను నెలకొల్పి చూపించారో, అది ఎంతో పెద్ద సంగతి గా ఉంది.’’ మంది ఈ కార్యక్రమాని కి సేవ ను జతపరచారు. వారి ఈ కరుణ, కర్తవ్యాల కారణం గానే ఒక్క రోజు లో 2.5 కోట్ల ప్రజల కు టీకా ను వేయడం సంభవం అయింది. హిమాచల్, గోవా, చండీగఢ్, లక్షద్వీప్ లు అర్హులైన జనాభా కు ఒకటో డోసు ను ఇప్పించే కార్యాన్ని పూర్తి చేసివేశారు. సిక్కిమ్, అండమాన్- నికోబార్, కేరళ, లద్దాఖ్, ఉత్తరాఖండ్, దాద్ రా నగర్ హవేలీ కూడా ఇక ఎంతో వెనుకబడి ఏమీ లేవు అని ప్రధాన మంత్రి తెలిపారు.

 

భారతదేశం తన టీకాకరణ ప్రయాసల లో పర్యటన స్థలాల కు ప్రాధాన్యాన్ని ఇచ్చింది, అయితే దీనిని గురించి ఇంత వరకు చర్చ జరుగలేదు అని ప్రధాన మంత్రి అన్నారు. పర్యటన స్థలాల ను తెరవడం కోసం ఇది అవసరపడింది. విదేశీ పర్యటకుల ను ప్రోత్సహించడానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనేక చర్యల ను తీసుకొంది. భారతదేశాని కి విచ్చేస్తున్న 5 లక్షల మంది పర్యటకుల కు ఉచిత వీజా, పర్యటన రంగం తో ముడిపడ్డ స్టేక్ హోల్డర్ లకు ప్రభుత్వ పూచీకత్తు తో 10 లక్షల వరకు రుణం, రిజిస్టర్డ్ టూరిస్ట్ గైడ్‌ ల కు 1 లక్ష రూపాయల వరకు రుణం ఇచ్చేందుకు నిర్ణయాన్ని తీసుకోవడమైంది అని ప్రధాన మంత్రి తెలిపారు.

 

గోవా లో పర్యటన రంగాన్ని మరింత ఆకర్షణీయం గా మలచడానికి, రాష్ట్రం లో రైతుల కు, మత్స్యకారుల కు మరిన్ని ఎక్కువ సౌకర్యాల ను అందించడానికి సంబంధించిన టువంటి ప్రయత్నాల కు డబుల్ ఇంజిన్ ప్రభుత్వంశక్తి ని అందిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. మోపా గ్రీన్ ఫీల్డ్ ఎయర్ పోర్టు మరియు 6 దోవ ల రాజమార్గాని కి 12 వేల కోట్ల రూపాయలు కేటాయింపు, ఉత్తర గోవా ను దక్షిణ గోవా ను కలిపే జువారీ వంతెన ను రాబోయే కొన్ని నెలల్లో ప్రారంభం తో రాష్ట్రం లో సంధానం మెరుగుపడనుంది.

 

గోవా అమృత కాలం లో ఆత్మ నిర్భరత ను సాధించడం కోసం స్వయం పూర్ణ గోవా సంకల్పాన్ని తీసుకొంది, 50 కంటే ఎక్కువ కంపోనెంట్ ల తయారీ ని మొదలుపెట్టింది అని ప్రధాన మంత్రి అన్నారు. టాయిలెట్ కవరేజి లో, 100 శాతం విద్యుతీకరణ లో గోవా కార్యసిద్ధుల ను గురించి, ‘హర్ ఘర్ జల్ప్రచార ఉద్యమం కోసం చేసిన కృషి ని గురించి ఆయన వివరించారు. దేశం లో 2 సంవత్సరాల లోపు 5 కోట్ల ఇళ్ల ను నల్లా నీటి తో జోడించడం జరిగింది. ఈ దిశ లో గోవా ప్రయత్నాల తో రాష్ట్రం సుపరిపాలన కోసం, జీవన సౌలభ్యం కోసం స్పష్టమైన ప్రాధాన్యాన్ని ఇచ్చినట్లు తెలుస్తున్నది. పేద కుటుంబాల కు రేశన్ అందించడం, ఉచిత గ్యాస్ సిలిండర్, పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి పంపిణీ, మహమ్మారి కాలం లో కిసాన్ క్రెడిట్ కార్డు ను ఒక మిశన్ రూపం లో విస్తరించడం, వీధుల లో తిరుగుతూ సరకుల ను అమ్మే వారి కి స్వనిధి యోజన తాలూకు ప్రయోజనాల ను అందించడం లో గోవా చేసిన కృషి ని కూడా ప్రధాన మంత్రి వివరించారు. గోవా ను అపరిమిత అవకాశాలు గల రాష్ట్రం గా ప్రధాన మంత్రి చెప్తూ, ‘‘గోవా దేశంలో కేవలం ఒక రాష్ట్రమే కాదు, అది బ్రాండ్ ఇండియా యొక్క ఒక బలమైన నిర్మాత గా కూడా ఉంది’’ అన్నారు.

 (Release ID: 1756357) Visitor Counter : 200