నీతి ఆయోగ్

‘భారతదేశంలో పట్టణ ప్రణాళిక సామర్థ్యంలో సంస్కరణలు’ అనే అంశంపై నితీ ఆయోగ్ నివేదిక

Posted On: 15 SEP 2021 1:45PM by PIB Hyderabad

‘భారతదేశంలో పట్టణ ప్రణాళిక సామర్థ్యంలో సంస్కరణలు’ అనే అంశంపై నితీ ఆయోగ్ రేపు (16 సెప్టెంబర్‌న‌) నివేదికను విడుదల చేయ‌నుంది. నితీ  ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌లు  నితీ ఆయోగ్ సీఈఓ శ్రీ అమితాబ్ కాంత్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె. రాజేశ్వరరావు, సంబంధిత లైన్ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల సమక్షంలో నివేదికను విడుదల చేయ‌నున్నారు. నితీ ఆయోగ్ అక్టోబర్ 2020 నెల‌లో ‘భారతదేశంలో పట్టణ ప్రణాళిక విద్యలో సంస్కరణలు’ అనే అంశంపై ఒక సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విష‌య‌మై క‌స‌ర‌త్తు చేసిన క‌మిటీ త‌న నివేదికను రూపొందించ‌డం ద్వారా తన ప‌నిని ముగించింది.  ఈ నివేదిక పట్టణ ప్రణాళికలోని వివిధ అంశాలపై సిఫారసులతో కూడిన‌ సమితిని కలిగి ఉంది-ఆరోగ్యకరమైన నగరాల ప్రణాళికలో జోక్యం చేసుకోవడం, పట్టణ భూభాగం యొక్క అత్యుత్తమ వినియోగం, మానవ వనరుల సామర్థ్యాలను పెంచడం, పట్టణ పాలనను బలోపేతం చేయడం, స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడం, ప్రైవేట్ రంగం పాత్రను పెంచడం వంటివి మరియు పట్టణ ప్రణాళిక విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడం వంటి అంశాల‌పై ఈ నివేదిక త‌న‌ నివేదిక‌ను విడుద‌ల చేయ‌నుంది. 



(Release ID: 1755067) Visitor Counter : 200