యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఫిట్ ఇండియా క్విజ్‌ కోసం 2 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు ఉచిత నమోదును క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది

Posted On: 14 SEP 2021 11:23AM by PIB Hyderabad

ప్రధానాంశాలు:
 -స్పోర్ట్స్ మరియు ఫిట్‌నెస్‌పై మొట్టమొదటి దేశవ్యాప్త క్విజ్, పాఠశాలకు వెళ్లే పిల్లలలో ఫిట్‌నెస్ మరియు క్రీడల గురించి అవగాహన కల్పించడానికి ఫిట్ ఇండియా క్విజ్ సెప్టెంబర్ 1 న ప్రారంభించబడింది.

పాఠశాల పిల్లల కోసం భారతదేశంలో మొట్టమొదటి ఫిట్నెస్ మరియు స్పోర్ట్స్ క్విజ్ అయిన ఫిట్ ఇండియా క్విజ్‌లో పాల్గొనేవారికి మరింత ఆకర్షణీయంగా మార్చబడింది. భారతదేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల కోసం ఒక పెద్ద బొనాంజాను ప్రభుత్వం ప్రకటించింది. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 1 లక్ష పాఠశాలల ద్వారా నామినేట్ చేయబడిన మొదటి 2 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు దేశవ్యాప్త భారత క్విజ్ కోసం ఉచితంగా నమోదు చేసుకోవచ్చని ప్రకటించింది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ కమ్‌ ప్రాతిపదికన ప్రతి పాఠశాల గరిష్టంగా ఇద్దరు విద్యార్థులను ఉచితంగా నామినేట్ చేయవచ్చు.

ఈ నిర్ణయాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు. " పాఠశాల పిల్లలలో ఫిట్‌నెస్ మరియు క్రీడాలపై అవగాహన పెంచడానికి ప్రధానమంత్రి దిశానిర్దేశం మేరకు ఫిట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా ఫిట్ ఇండియా క్విజ్ ప్రారంభించబడింది. ఇది ఫిట్‌గా జీవించడం యొక్క ప్రాముఖ్యత గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఫిట్ ఇండియా క్విజ్‌లో చేరడానికి మరింత మంది విద్యార్థులను ప్రేరేపించడానికి మొదటి లక్ష పాఠశాలల నుండి 2 లక్షల మంది విద్యార్థుల భాగస్వామ్య రుసుము రద్దు చేయబడింది ”అని శ్రీ ఠాకూర్ చెప్పారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఫిట్ ఇండియా క్విజ్‌ను శ్రీ ఠాకూర్ ప్రారంభించారు. క్రీడలు మరియు ఫిట్‌నెస్‌పై చేపట్టిన ఈ  క్విజ్ సెప్టెంబర్ 1 న దేశవ్యాప్తంగా ప్రారంభించబడింది. స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసామవుతున్న ఈ జాతీయస్థాయి క్విజ్‌లో రూ. 3.25 కోట్లు బహుమతి ఉంది.

ఈ క్విజ్‌లో  దేశంలోని ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం నుండి ప్రాతినిధ్యం కలిగి ఉంటుంది. మరియు ఆన్‌లైన్ రౌండ్ల మిశ్రమంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థులు తమ ఫిట్‌నెస్ మరియు క్రీడా పరిజ్ఞానాన్ని తమ తోటివారికి ప్రదర్శించే విధంగా ఈ ఫార్మాట్ రూపొందించబడింది.

ఫిట్ ఇండియా క్విజ్‌లో పాల్గొనే వారికి అవసరమైన వివరాలు ఫిట్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 

*****(Release ID: 1754757) Visitor Counter : 43