యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టోక్యో పారాలింపిక్స్ పతక విజేతలను సన్మానించిన క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ పారాలింపిక్ క్రీడల నూతన శకం ప్రారంభం


2024, 2028 పారాలింపిక్ పోటీల సన్నాహాలకు ప్రభుత్వ పూర్తి సహకారం

పారా అథ్లెట్ల అసాధారణ ప్రదర్శన దేశంలో క్రీడల పట్ల వైఖరిని మార్చింది: క్రీడా మంత్రి

Posted On: 08 SEP 2021 5:50PM by PIB Hyderabad

ముఖ్య అంశాలు:

* సన్మాన కార్యక్రమానికి హాజరైన కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు ,మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్

*          టోక్యోలో జరిగిన పారాలింపిక్ క్రీడల్లో  స్వర్ణం మరియు రజతాలు సహా 19 పథకాలు సాధించిన భారత పారా అథ్లెట్లు

 

టోక్యోలో జరిగిన  పారాలింపిక్ క్రీడలలో స్వర్ణం మరియు రజతలతో సహా  19 పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన  భారత పారా అథ్లెట్లను కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ సన్మానించారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు , యువజన వ్యవహారాలు మరియు క్రీడల సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్రీడల శాఖ కార్యదర్శి శ్రీ రవి మిట్టల్యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి ఉషా శర్మమంత్రిత్వ శాఖ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ అనురాగ్ ఠాకూర్ అద్భుత ప్రదర్శన చూపిన  పారా అథ్లెట్లను అభినందించారు. ' 2016లో జరిగిన పారాలింపిక్స్ లో భారతదేశం తరఫున 19 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ ఏడాది దేశం 19 పతకాలను సాధించింది.   ఆత్మధైర్యం  అన్నింటికన్నా శక్తివంతమైనదని మీరు నిరూపించారు! మనం సాధించిన  పతకాల సంఖ్య దాదాపు ఐదు రెట్లు పెరిగింది. తొలిసారిగా మనం  టేబుల్ టెన్నిస్‌లో పతకాలు సాధించాము. ఆర్చరీలో ఎక్కువ  పతకాలు సాధించాము.  మొదటిసారి కానోయింగ్ మరియు పవర్ లిఫ్టింగ్‌లో పోటీ పడ్డాము.  మనం రెండు ప్రపంచ రికార్డులను సమం చేశాము. మరికొన్ని రికార్డులను నెలకొల్పాము. భారతదేశ పారా అథ్లెట్లు అబ్దుతమైన ప్రతిభ కనబరిచి ముగించారు !"అని మంత్రి అన్నారు. 

 

ప్రపంచ పోటీల్లో పాల్గొంటున్న సహకారం అందించే అంశంలో  ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల్లో సమూల మార్పులు వచ్చాయని మంత్రి తెలిపారు. అంతర్జాతీయంగా మరింతగా రాణించడానికి పారా అథ్లెట్లకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను, ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. తరచూ పోటీల్లో పాల్గొంటూ ప్రతిభను మరింత మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వం ప్రాంతీయ, జాతీయ స్థాయి పోటీలను నిర్వహిస్తుందని అన్నారు. 2024, 2028 లలో జరిగే పారాలింపిక్స్ లో మరింత ఎక్కువగా పతకాలను సాధించడానికి దోహదపడే శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించి క్రీడాకారులకు సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ లో పారా అథ్లెట్లందరూ సభ్యులుగా ఉంటారని మంత్రి వివరించారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ కింద ఎక్కువ మంది క్రీడాకారులు ప్రయోజనం పొందేలా చూడడానికి చర్యలు తీసుకుని, కార్యక్రమాన్ని కొనసాగిస్తామని శ్రీ అనురాగ్ ఠాకూర్ అన్నారు. భారతదేశం అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆశయ సాధనకు ఇది దోహదపడుతుందని మంత్రి అన్నారు. 

 

అథ్లెట్లు చూపిన  అసాధారణ ప్రదర్శనతో  దేశంలో పారా - స్పోర్ట్స్ పట్లప్రజల ఆలోచనా విధానం మారిందని  శ్రీ ఠాకూర్ అన్నారు. ప్రభుత్వం ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించిందని  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వయంగా క్రీడాకారులతో మాట్లాడి వారిని ప్రోత్సహించారని శ్రీ ఠాకూర్ పేర్కొన్నారు. ఒక సందర్భంలో  పారా అథ్లెట్లు, వారి కుటుంబాలతో ప్రధానమంత్రి  దాదాపు రెండు గంటలు పైగా మాట్లాడారని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేసిన చర్యలు, ప్రధానమంత్రి అనుసరించిన వైఖరి సమాజంలోని ప్రతి విభాగం, వ్యక్తికార్పొరేట్క్రీడా సంఘాలు లేదా మరే ఇతర సంస్థపై ప్రభావం చూపుతుందని అన్నారు. 

పతకాలు సాధించిన ప్రతి ఒక్కరిని కేంద్ర న్యాయ  శాఖ మంత్రి శ్రీ రిజిజు అభినందించారు. టోక్యోలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన పారా అథ్లెట్లను ఆయన  హీరోలుగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరికి  స్ఫూర్తి కల్పించిన క్రీడాకారులు  ధైర్యంతో  దేనినైనా సాధించవచ్చని నిరూపించారని  ఆయన అన్నారు. ప్రతి క్రీడాకారుడి కథ స్ఫూర్తిదాయకం అని అన్న  శ్రీ రిజిజు  ఆటగాళ్లను హీరోగా పరిగణించినప్పుడు దేశంలో క్రీడా సంస్కృతి ఏర్పడుతుందని అన్నారు.   క్రీడా సంస్కృతి   చివరకు భారతదేశానికి వచ్చిందని అన్నారు. ఈ మార్పు రావడానికి ప్రధానమంత్రి ప్రధాన కారణమని   శ్రీ కిరణ్ రిజిజు అన్నారు.

 

ప్రభుత్వం నుంచి అందిన సహకారంతో క్రీడాకారులు స్ఫూర్తి పొంది రాణించారని  యువజన  వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ  మంత్రి శ్రీ ప్రమాణిక్ అన్నారు. ప్రధానమంత్రి స్వయంగా మాట్లాడి  పతకాలు సాధించడానికి ప్రతి అథ్లెట్‌ ను ఉత్సాహపరిచారని ఆయన అన్నారు.

దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించి వారిని సమాజంలో భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం,  ప్రధానమంత్రి చేస్తున్న ప్రయత్నాలు తీసుకుంటున్న చొరవలను భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి దీపా మాలిక్ ప్రశంసించారు.  టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్    కింద పారా అథ్లెట్లకు అందించిన సహకారం నూతన మద్దతు చరిత్రను  సృష్టించిందని  అన్నారు.  టోక్యో ఒలింపిక్స్‌లో పెరిగిన మహిళా అథ్లెట్ల ప్రాతినిధ్యం, వారు సాధించిన విజయాలను   శ్రీమతి దీప ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

టోక్యో 2020 లో భారతదేశం 19 పతకాలు సాధించింది.  టోక్యో 2020 లో పోటీ పడిన  162 దేశాలలో మొత్తం పతకాల జాబితాలో 24 వ స్థానంలో నిలిచింది.  మొత్తం పతకాల ఆధారంగా 20 వ స్థానంలో ఉంది. 1968 లో పారాలింపిక్ క్రీడలు ప్రారంభమైనప్పటి నుంచి 2016 వరకు భారతదేశం కేవలం 12 పతకాలు మాత్రమే సాధించింది.

***


(Release ID: 1753299) Visitor Counter : 252