ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ కేసు
ప్రజా ఆరోగ్య చర్యల అమలులో కేరళకు సహాయం అందజేయడానికి బృందాన్ని పంపిన కేంద్రం
प्रविष्टि तिथि:
05 SEP 2021 8:00AM by PIB Hyderabad
కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఒక నిపా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. మెదడువాపు మరియు హృదయ కండరముల వాపు లక్షణాలతో ఒక 12 సంవత్సరాల బాలుడుకి నిఫా వైరస్ సోకినట్టు కేరళలోని కోజికోడ్ జిల్లాలో గుర్తించారు. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన బాలుడు ఈ ఉదయం మరణించాడు.
పండు గబ్బిలాల లాలాజలం ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. నిఫా వైరస్ కేసు వెలుగు చూడడంతో కేరళకు కేంద్రం ప్రత్యేక బృందాన్ని పంపింది. కేరళ ప్రభుత్వానికి అవసరమైన సాంకేతిక ఇతర సహాయ సహకారాలను బృందం అందిస్తుంది.
ఈ కింది ప్రజారోగ్య చర్యలను తక్షణం అమలు చేయాలని కేంద్రం సూచించింది.
1. కోజికోడ్ జిల్లా తరహా భౌగొళిక పరిస్థితులు ఉన్న (ముఖ్యంగా మలప్పురం) ప్రాంతాల గ్రామాల్లో క్రియాశీల కేసులను పరిశీలించడం
2. గత 12 రోజుల్లో క్రియాశీలకంగా ఉన్న కాంటాక్ట్ ట్రేసింగ్ (ఏదైనా కాంటాక్ట్‌ల కోసం).
3. వ్యాధి సోకిన వారితో కలసి తిరిగిన వారిని, వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నవారిని విడిగా ఉంచడం
4. నమూనాలను సేకరించి పరీక్షలకు పంపడం ల్యాబ్ లకు పంపడం .
గతంలో 2018లో కూడా కేరళలోని కోజికోడ్ మరియు మలప్పురం జిల్లాలలో నిపా వ్యాప్తి చెందింది.
(रिलीज़ आईडी: 1752342)
आगंतुक पटल : 325