ప్రధాన మంత్రి కార్యాలయం

పారాలింపిక్స్ఆటల లో బాడ్ మింటన్ లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు శ్రీ ప్రమోద్ భగత్ కు అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 04 SEP 2021 5:24PM by PIB Hyderabad

టోక్యో లో జ‌రుగుతున్న పారాలింపిక్స్ ఆట‌ల లో బాడ్ మింటన్ లో స్వర్ణ ప‌త‌కం గెలిచినందుకు శ్రీ ప్రమోద్ భగత్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

‘‘శ్రీ ప్రమోద్ భగత్ యావత్తు దేశ ప్రజల హృద‌యాల ను గెలుచుకొన్నారు. ఆయన ఒక అసహాయ శూరుడు; ఆయన సఫలత లక్షల కొద్దీ మంది కి ప్రేరణ ను ఇస్తుంది. ఆయన అసాధారణమైనటువంటి హుషారు ను, దృఢ సంకల్పాన్ని చాటారు. బాడ్ మింటన్ లో బంగారు పతకాన్ని గెలిచినందుకు ఆయన కు అభినందనలు. ఆయన భావి ప్రయాసల లో చక్కగా రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను. @PramodBhagat83’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/SH(Release ID: 1752110) Visitor Counter : 171