ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
2025 నాటికి ఇండియాను టిబి రహితంగా చేయాలన్నది ప్రధానమంత్రి కల.
-క్షయవ్యాధిపై పోరాటంలో సాధించిన ప్రజారోగ్య ప్రగతిపై అన్ని రాష్ట్రాలతో నిర్వహించిన సమీక్షకు అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ
-క్షయ వ్యాధిపై పోరాటాన్ని ప్రజా పోరాటంగా , ప్రజల చొరవతో చేపట్టే ఉద్యమంగా తీర్చిదిద్దాలి: శ్రీ మన్‌సుఖ్ మాండవీయ
-“సమన్వయంతో కూడిన , సమష్టి కృషి ఉమ్మడి లక్ష్యాల సత్వర సాధనకు ఉపకరిస్తుంది.”
Posted On:
02 SEP 2021 2:47PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ , కేంద్ర రాష్ట్రప్రభుత్వాల సహకారంతో టిబిపై పోరాటానికి చేపట్టిన నిరంతర చర్యల ఫలితంగా సాధించిన ప్రగతిపై రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ప్రిన్సిపుల్ సెక్రటరీలు, అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అనదపు ఛీప్ సెక్రటరీలతో నిర్వహించిన సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా పాల్గొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న వారిలో ఛత్తీస్‌ఘడ్ ఆరోగ్య మంత్రి టిఎస్.సింగ్ దేవ్, బీహార్ ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ మంగల్ పాండే, హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ అనిల్ విజ్, ధిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యేంద్ర కుమార్ జైన్, మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి శ్రీ రాజేష్ తోపె, ఒడిషా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ నవ కిషోర్ దాస్, హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ రాజివ్ సైజల్, జార్ఖండ్ ఆరోగ్య వైద్య విద్య శాఖ మంత్రి శ్రీ బన్నా గుప్త, కర్ణాటక ఆరోగ్య వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి వీనా జార్జి, రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ రఘుశర్మ తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించారు.
క్షయవ్యాధి నిర్మూలనకు దృష్టి కేంద్రీకరించడంపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షం వ్యక్తం చేశారు
రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల అత్యుత్తమ పద్ధతులను గుర్తించి వాటిని అనుసరించేలా ఎప్పటికప్పుడు ఈవిషయంపై చర్చిస్తూ ఉండాలని సూచించారు.ఇవి ఉమ్మడి విధానాలను అనుసరించడానికి , ఉమ్మడి లక్ష్యాల సాధనకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. సమన్వయంతో కూడిన, సమష్టి కృషి ఉమ్మడి లక్ష్యాలను సత్వరం సాధించడానికి ఎంతగానో దోహదపడతాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ క్షయవ్యాధి నిర్మూలనలో మనం సామాన్యులను ప్రోత్సహించవలసి ఉంది. దీనిని ప్రజా ఉద్యమంగా మలచవలసి ఉంది. ” అని ఆయన అన్నారు. 2025 నాటికి దేశాన్ని క్షయవ్యాధి రహితం చేయాలన్న ప్రధానమంత్రి కలను సాకారం చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చే సూచనలు సలహాలను స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు శ్రీ మాండవీయ తెలిపారు. కోవిడ్ -19ను ఎదుర్కోవడంలో ప్రజారోగ్య నిర్వహణ , కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్వహించే వివిధ కార్యక్రమాలపై తగిన సలహాలు ,సూచనలు ఇవ్వాల్సిందిగా ఆయన రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు.
కోవిడ్ -19 వల్ల టిబి విషయంలో సాధించిన పురోగతికి ఎదురవుతున్న ముప్పుగురించి ప్రస్తావిస్తూ ఆయన ఇటీవలి కాలంలో కోవిడ్ -19 వాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసినట్టు తెలిపారు. సెప్టెంబర్ 5 నాటికి దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరికీ వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన ప్రాధాన్యతను మాండవీయ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రాలకు అదనపు డోస్‌లు అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఇందుకు సంబంధించి, రాష్ట్రాలు ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్‌లను నిర్వహించాలని ఉదాహరణకు కొన్ని ప్రత్యేక రోజులను ప్రజలతో నేరుగా మమేకం అయ్యే వివిధ వర్గాలైన మార్కెట్‌లలోని కూరగాయల వ్యాపారులు, లేదా ఆయా ప్రాంతాలలోని రిక్షా కార్మికుల వంటివారికి కేటాయించాలని సూచించారు.
వాక్సిన్ తయారీ ప్రతినెలా పెంచుకుంటూ పోతున్నందున వాక్సిన్ సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలుఉంటే వాటిని పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు వాక్సిన్ తయారీదారులతో నిరంతరం సంబంధాలు కలిగిఉన్నట్టు ఆయన తెలిపారు.
వాక్సిన్ వేయించుకుంటున్నప్పటికీ రాష్ట్రాలు కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటించాల్సిందిగా ప్రజలను ప్రోత్సహించడం కొనసాగించాలని దేశంలో పరిస్థితులు మెరుగుపడ్డాయని ఎలాంటి అలక్ష్యం పనికిరాదని ఆయన సూచించారు.
సహకార ఫెడరలిజం భావనను ప్రస్తావిస్తూ డాక్టర్ పవార్, రాగల మూడు సంవత్సరాలలో క్షయవ్యాధిని దేశం నుంచి రూపుమాపేలా చేసేందుకు కలసి కట్టుగా కృషి చేయవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.కోవిడ్ మహమ్మారి సమయంలో తీసుకున్న వివిధ చర్యలను ఆమె అభినందించారు. టిబిని నిర్ధారించేందుకు బయో డైరక్షనల్ స్క్రీనింగ్, కోవిడ్ పరీక్షలు, టిబి మందులు ఇంటివద్దకే వెళ్లి అందజేయడం, వంటి చర్యలను ఆమె అభినందించారు.టిబి కి సంబంధించి క్రియాశీల కేసులను గుర్తించడంలో ఆరోగ్య సిబ్బంది మొత్తం కృషిని ఆమె అభినందించారు. జన్ జన్‌కో జగానా హై, టిబికో భగానా హై అని ఆమె పిలుపునిచ్చారు.
2025 నాటికి టీబీ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రారంబించిన ఉద్యమానికి మద్దతుగా గత కొద్ది సంవత్సరాలుగా తాము చేపట్టిన ప్రణాళికలు వాటి ప్రభావాన్ని ఈ కార్యక్రమానికి హాజరైన అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు తెలియజేశాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషన్, ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజ , ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ అగ్నాని, ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1751565)
Visitor Counter : 288
Read this release in:
Gujarati
,
Tamil
,
Kannada
,
Manipuri
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Malayalam