ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్ -19అత్యావ‌శ్య‌క ఔష‌ధాలు వాటి నిల్వ‌ల‌కు సంబంధించి స‌మీక్ష నిర్వ‌హించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌


8 ఔష‌ధాల‌కు సంబంధించి బ‌ఫ‌ర్ స్టాక్‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన మంత్రి, ముడిస‌రుకు, త‌గినన్ని నిల్వ‌లు దేశంలో అందుబాటు.

Posted On: 01 SEP 2021 6:21PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, ర‌సాయ‌నాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ మ‌న్‌సుఖ్ మాండ‌వీయ ఈరోజు కోవిడ్ -19 సంబంధిత‌ అత్యావ‌స్య‌శ్య‌క‌ ఔష‌ధాలు దేశంలో  అందుబాటుకు సంబంధించి స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ స‌మీక్ష సంద‌ర్భంగా అత్యావ‌శ్య‌క ఔష‌ధాలు త‌గినంత‌గా అందుబాటులో ఉన్న‌ట్టు గుర్తించారు.  ఈ ఔష‌ధాల‌కు సంబంధించిన ముడిస‌రుకు కూడా కావ‌ల‌సినంత స్థాయిలో అందుబాటులో ఉన్నాయి.

8 ఔష‌ధాల‌కు సంబంధించి వ్యూహాత్మ‌క బ‌ఫ‌ర్ స్టాక్‌లను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ ఔష‌ధాలు అన్నీ దేశంలో ల‌భించేవే. 

ఈ జాబితాలోని 8 ఔష‌ధాలు..

1. టొసిలిజుమాబ్ (Tocilizumab)

2. మిథైల్ ప్రిడినిసొలోన్ (Methyl Predinisolone)

3. ఎనాక్సోపిరిన్‌(Enaxopirin)

4. డెక్సామిథ‌సోన్ (Dexamethasone)

5. రెమిడిసివిర్ (Remdesivir)

6. ఆంఫొటెరిసిన్ బి డియోక్సీచొలేట్ (Amphotericin B Deoxycholate)

7. పొసాకొన‌జోల్ (Posaconazole)

8. ఇంట్రావీన‌స్ ఇమ్యునోగ్లోబిలిన్ (Intravenous Immunoglobilin (IVIG)

 ఈ స‌మీక్షా స‌మావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కు చెందిన సీనియ‌ర్ అధికారులు పాల్గొన్నారు.

***


(Release ID: 1751242) Visitor Counter : 221