ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారి 125 వ జయంతి సందర్భం లో ఒక ప్రత్యేకమైన స్మారక నాణేన్ని విడుదల చేసిన ప్రధాన మంత్రి
శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారు భారతదేశం గొప్ప భక్తుడు కూడాను: ప్రధాన మంత్రి
మనకు ఉన్న యోగ జ్ఞానం నుంచి, మనకు ఉన్న ఆయుర్వేద జ్ఞానం నుంచి ప్రపంచం లాభపడాలి అన్నదే మన సంకల్పం గా ఉంది: ప్రధాన మంత్రి
భక్తి కాలం నాటి సామాజిక క్రాంతి లేనిదే భారతదేశం హోదా ను, భారతదేశం స్వరూపాన్ని ఊహించుకోవడం కష్టమే: ప్రధాన మంత్రి
శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారు భక్తి వేదాంతాన్ని ప్రపంచ చేతన తో జోడించారు
Posted On:
01 SEP 2021 5:36PM by PIB Hyderabad
శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారి 125వ జయంతి సందర్భం లో ఒక ప్రత్యేకమైన స్మారక నాణేన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భం లో సంస్కృతి, పర్యటన, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (డిఒఎన్ఇఆర్) కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తదితరులు పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రోతల ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఒక రోజు ముందే జన్మాష్టమి రావడం, ఇప్పుడు శ్రీల ప్రభుపాద గారి 125 వ జయంతి కావడం సంతోషదాయకం అయినటువంటి యాదృచ్ఛిక ఘటన అని ప్రస్తావించారు. ‘‘ఇది సాధన ద్వారా సంతోషాన్ని, సంతృప్తి ని ఏక బిగి న సాధించుకోవడం లాగా ఉంది. అంతేకాదు, ఈ సందర్భం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సంబరాల మధ్య చోటు చేసుకొంటోంది అని ఆయన గుర్తు కు తెచ్చారు. శ్రీల ప్రభుపాద స్వామి గారి కి చెందిన లక్షల కొద్దీ అనుయాయులు, ప్రపంచం అంతటా విస్తరించిన లక్షల కొద్దీ కృష్ణ భక్తులు ఈ రోజు న ఇటువంటి అనుభూతి నే పొందుతూ ఉన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
కృష్ణ భగవానుడు అంటే ప్రభుపాద స్వామి గారి కి ఉన్నటువంటి మహనీయ భక్తి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రభుపాద స్వామి గారు భారత్ కు కూడా ఒక గొప్ప భక్తుడు అన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటం లో ప్రభుపాద స్వామి గారు కూడా సంఘర్షణ చేశారు అని ప్రధాన మంత్రి వివరించారు. సహాయ నిరాకరణ ఉద్యమాని కి సమర్ధన గా ప్రభుపాద స్వామి గారు స్కాట్‌లాండ్ కు చెందిన ఒక కళాశాల నుంచి డిప్లొమా ను స్వీకరించడానికి తిరస్కరించారు అని ప్రధాన మంత్రి అన్నారు.
యోగ ను గురించిన మన జ్ఞానం ప్రపంచం అంతటా విస్తరించింది, అదే మాదిరి గా భారతదేశం అనుసరించిన నిలకడతనం తో కూడిన జీవన శైలి, ఆయుర్వేద వంటి విజ్ఞాన శాస్త్రం కూడా ప్రపంచం అంతటా వ్యాప్తి చెందాయి అని ప్రధాన మంత్రి అన్నారు. వీటి ద్వారా యావత్తు ప్రపంచం ప్రయోజనాల ను పొందాలి అనేదే మన సంకల్పం గా ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మనం మరే దేశానికైనా వెళ్ళి అక్కడి ప్రజల ను కలుసుకొన్నపుడల్లా వారు ‘హరే కృష్ణ’ అంటూ మనను పలకరిస్తున్నారని, దీని ద్వారా మనం మరింత ఆత్మీయ భావన ను పొందుతూ గర్వపడుతున్నాం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులు అదే విధమైన ఆప్యాయత ను అందుకొన్నప్పుడు కూడా ఇదే విధమైన భావన ఏర్పడుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ విషయం లో ఐఎస్‌కెసిఒఎన్ (‘ఇస్కాన్’) నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు అని ఆయన అన్నారు.
బానిసత్వం కాలం లో భక్తి అనేది భారతదేశం తాలూకు స్ఫూర్తి ని సజీవం గా ఉంచింది అని ప్రధాన మంత్రి అన్నారు. భక్తి యుగం తాలూకు సామాజిక క్రాంతి అంటూ ఏదీ లేకపోతే గనక భారతదేశం తాలూకు హోదా ను, భారతదేశం తాలూకు స్వరూపాన్ని ఊహించడానికి కష్టమైపోయేది అని నేటి పండితులు అభిప్రాయపడుతున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. భక్తి అనేది విశ్వాసం, సామాజిక అంతస్తులు, విశేష అధికారాలు అనే వివక్ష ను తొలగించి, ప్రాణి ని దైవం తో జత పరచింది అని ఆయన అన్నారు. అటువంటి కష్ట కాలాల లో సైతం చైతన్య మహా ప్రభు గారు వంటి సాధువులు సంఘాన్ని భక్తి తాలూకు స్ఫూర్తి తో ముడిపెట్టి ‘ధర్మం నుంచి (ఆత్మ)విశ్వాసం’ అనే మంత్రాన్ని అందించారు అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
ఒక కాలం లో వేదాంతాన్ని పశ్చిమ దేశాల చెంతకు తీసుకుపోవడం కోసం స్వామి వివేకానందుల వారు వంటి ఒక ముని రాగా, భక్తి యోగ ను ప్రపంచానికి అందించేటటువంటి ఒక బృహత్తర బాధ్యత ను శ్రీల ప్రభుపాద గారు మరియు ఇస్కాన్ తీసుకున్నట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భక్తి వేదాంతాన్ని ప్రపంచం తాలూకు చైతన్యం తో శ్రీల ప్రభుపాద గారు పెనవేశారు అని ప్రధాన మంత్రి చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచం లో వివిధ దేశాల లో ఇస్కాన్ ఆలయాలు వందల సంఖ్య లో ఉన్నాయని, మరి అనేక గురుకులాలు భారతీయ సంస్కృతి ని నిలబెడుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశాని కి ధర్మం అంటే ఉత్సాహం, ఉద్వేగం, ఉల్లాసం లతో పాటు మానవ జాతి పట్ల నమ్మకం కూడాను అని ప్రపంచాని కి ఇస్కాన్ బోధించింది అని ప్రధాన మంత్రి వివరించారు. కచ్ఛ్ లో భూకంపం సంభవించినప్పుడు, ఉత్తరాఖండ్ దుర్ఘటన వేళ, అలాగే ఒడిశా లో, బంగాల్ లో తుఫాను లు విరుచుకుపడినప్పుడు ఇస్కాన్ అందించిన సేవల ను గురించి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రకటించారు. మహమ్మారి కాలం లో ఇస్కాన్ కృషి ని కూడా ప్రధాన మంత్రి ప్రశంసించారు.
***
DS/AK
(Release ID: 1751162)
Visitor Counter : 274
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam