ఆయుష్
‘ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్’ లో భాగంగా రేపు ఏడుగురు కేంద్ర మంత్రులు ప్రారంభించనున్న - "యోగా-బ్రేక్" మొబైల్ యాప్
Posted On:
31 AUG 2021 6:09PM by PIB Hyderabad
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా, రేపు (2021 సెప్టెంబర్, 1వ తేదీ) విజ్ఞాన్ భవన్ లో ప్రముఖుల సమక్షంలో నిర్వహించే ఒక కార్యక్రమంలో, కేంద్ర ఆయుష్, నౌకాశ్రయాలు, రవాణా, రహదారుల శాఖల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మరో ఆరుగురు కేంద్ర మంత్రులతో కలిసి, వై-బ్రేక్ మొబైల్ యాప్ ను ప్రారంభించనున్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ 2021 ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు వారం రోజుల పాటు వరుసగా వివిధ వేడుకలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించింది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో - కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మరియు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి, శ్రీ మన్సుఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవియా; కేంద్ర చట్టం, న్యాయ శాఖ మంత్రి, శ్రీ కిరణ్ రిజిజు; కేంద్ర సమాచార, ప్రసార మరియు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి, శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్; కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞానం, డి.ఓ.పి.టి., ప్రధానమంత్రి కార్యాలయం శాఖల ఇంచార్జ్ సహాయ మంత్రి, శ్రీ జితేంద్ర సింగ్; కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి; ఆయుష్ శాఖ మరియు స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి, డా. ముంజపారా మహేంద్ర భాయ్ కలుభాయ్ తో పాటు పలువురు ఇతర ప్రముఖులు కూడా పాల్గొంటారు.
5 నిమిషాల 'యోగా బ్రేక్ ప్రోటోకాల్' - పని ప్రదేశంలో వ్యక్తుల ఉత్పాదకతను పెంచడం కోసం ఒత్తిడిని తగ్గించడానికి, రిఫ్రెష్ చేయడానికి, పనిపై మళ్లీ దృష్టి పెట్టడానికి చాలా ఉపయోగకరమైన యోగా అభ్యాసాలను కలిగి ఉంటుంది. "యోగా బ్రేక్" (వై - బ్రేక్) అనే భావన ప్రపంచవ్యాప్తంగా పనిచేసే నిపుణులకు సంబంధించినది. పరీక్షించిన నిర్వహణ నియమాలతో ప్రముఖ నిపుణులు దీనిని జాగ్రత్తగా అభివృద్ధి చేశారు.
ప్రోటోకాల్ (నిర్వహణ నియమాలు) ఈ క్రింది విధంగా కొన్ని సాధారణ యోగ పద్ధతులను కలిగి ఉంటుంది:
తడాసనం - ఊర్ధ్వ-హస్తోత్తనాసనం - తడాసనం
స్కంధ చక్ర - ఉత్తానమందూకాసనం – కటి చక్రాసనం
అర్ధచక్రసనం, ప్రసారిత పాదోత్తాసనం - దీర్ఘ శ్వాస
నాడీ శోధన ప్రాణాయామం
భ్రమరీ ప్రాణాయామం - ధ్యానం
వివిధ వాటాదారుల సమన్వయంతో ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికగా 2020 జనవరి నెలలో, ఈ మాడ్యూల్ ను ప్రారంభించారు. దేశంలోని ఆరు ప్రముఖ యోగా సంస్థల సహకారంతో మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ మొత్తం 15 రోజుల ట్రయల్ నిర్వహించింది. ఇందులో వివిధ ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల నుండి మొత్తం 717 మంది పాల్గొన్నారు. ఈ ట్రయల్ భారీ విజయాన్ని సాధించింది.
రేపు నిర్వహించే ప్రారంభ వేడుకల్లో భాగంగా, ఐదు నిమిషాల యోగా నిర్వహణ నియమాలు / ప్రత్యక్ష ప్రదర్శన గురించి ఎం.డి.ఎన్.ఐ.వై. డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ వి. బసవరెడ్డి; యాప్ వినియోగంపై సాంకేతిక అంశాల గురించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఓ.ఎస్.డి.(ఆయుష్ గ్రిడ్), డాక్టర్ లీనా ఛత్రే, వివరంగా తెలియజేస్తారు.
"యోగా-బ్రేక్" మొబైల్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో - ప్రముఖ యోగా అభ్యాసకులు, పండితులు, విధాన రూపకర్తలు, ప్రభుత్వోద్యోగులు, యోగా ఔత్సాహికులు, అనుబంధ శాస్త్రాల నిపుణులతో సహా దాదాపు 600 మంది పాల్గొంటారు.
*****
(Release ID: 1750934)
Visitor Counter : 202