ప్రధాన మంత్రి కార్యాలయం
పారాలింపిక్స్ ఆటల లో జావెలిన్ త్రో లో స్వర్ణ పతకం గెలిచినందుకు శ్రీ సుమిత్ ఆంతిల్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
30 AUG 2021 5:39PM by PIB Hyderabad
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో జావెలిన్ త్రో లో స్వర్ణ పతకం గెలిచిన శ్రీ సుమిత్ ఆంతిల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘మన క్రీడాకారులు/క్రీడాకారిణులు #Paralympics లో రాణిస్తూ వస్తున్నారు. పారాలింపిక్స్ లో అంతవరకు ఉన్న రికార్డు ను బద్దలుకొడుతూ శ్రీ సుమిత్ ఆంతిల్ ఇచ్చిన ప్రదర్శన ను చూసి దేశ ప్రజలు గర్వపడుతున్నారు. ప్రతిష్టాత్మకమైనటువంటి బంగారు పతకాన్ని గెలినందుకు శ్రీ సుమిత్ కు ఇవే అభినందనలు. మీరు భవిష్యత్తు లో సైతం అత్యుత్తమం గా ఆడాలి అని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1750537)
సందర్శకుల సూచీ సంఖ్య : : 179
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam