ప్రధాన మంత్రి కార్యాలయం

పీఎం జన్‌ధన్‌ యోజనకు ఏడేళ్లు... ఈ నేపథ్యంలో దీన్ని భారత ప్రగతి పథాన్ని పరివర్తనవైపు మళ్లించిన శాశ్వత చర్యగా అభివర్ణించిన ప్రధానమంత్రి

Posted On: 28 AUG 2021 11:18AM by PIB Hyderabad

   ‘పీఎం జన్‌ధన్‌ యోజన’కు శ్రీకారం చుట్టి ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘పీఎం జన్‌ధన్‌ యోజన’ను విజయవంతం చేయడంలో నిరంతరం కృషిచేసిన వారందరినీ ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.

ఈ మేరకు ప్రధాని కొన్ని ట్వీట్లద్వారా ఇచ్చిన సందేశాల్లో-

“ఇవాళ్టితో #PMJanDhanకు ఏడు సంవత్సరాలు పూర్తయ్యాయి. దీన్ని భారత ప్రగతి పథాన్ని పరివర్తనవైపు మళ్లించిన శాశ్వత చర్యగా పేర్కొనవచ్చు. ఇది ఆర్థిక సార్వజనీనతకు భరోసా ఇవ్వడంతోపాటు అసంఖ్యాక భారతీయులకు గౌరవప్రదమైన జీవితాన్నిచ్చి సాధికారతకూ దోహదపడింది. అలాగే పారదర్శకతను పెంపొందించడంలోనూ ఎంతగానో తోడ్పడింది.

   ఈ నేపథ్యంలో #PMJanDhanను విజయవంతం చేయడం కోసం అవిశ్రాంతంగా శ్రమించిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను. వారి కృషి ఫలితంగా భారత ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాల దిశగా భరోసా లభించింది” అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH

 (Release ID: 1749902) Visitor Counter : 42