ప్రధాన మంత్రి కార్యాలయం

యువచిత్రకారుడి ని ఆయన చిత్రలేఖనాల కు మరియు ప్రజారోగ్యం పట్ల ఆయన లో ఉన్న శ్రద్ధ కుగాను ప్రశంసించిన ప్రధాన మంత్రి


సృజనాత్మకరంగాల లో యువజనుల కు ఉన్న సమర్పణ భావాన్ని, ఆసక్తి ని గమనించడం చాలా సంతోషాన్ని ఇస్తోంది: ప్రధాన మంత్రి

సుందరమైనమీ చిత్రలేఖనాల లాగానే మీ భావాలు కూడా సుందరం గా ఉన్నాయి: ప్రధాన మంత్రి

ప్రజలందరికిటీకామందు ను ఇప్పించే ప్రచార కార్యక్రమం, క్రమశిక్షణలతో పాటు 130 కోట్ల మంది భారతీయుల సమష్టి ప్రయాస లు మహమ్మారి కి వ్యతిరేకం గా మనపోరాటానికి బలాన్ని ఇస్తున్నాయి: ప్రధాన మంత్రి

సకారాత్మకతనువ్యాప్తి చేయడం కోసం శ్రీ స్టీవెన్ చేసిన ప్రయత్నాన్ని చూసి ప్రజలు ప్రేరణనుపొందుతారని ప్రధాన మంత్రి ఆశా భావాన్ని వ్యక్తం చేశారు

ప్రధాన మంత్రి కి ఒక లేఖ ను రాసి, రెండు చిత్ర లేఖనాల ను ఆయన కు పంపిన శ్రీస్టీవెన్ హ్యారిస్

Posted On: 26 AUG 2021 5:40PM by PIB Hyderabad

బెంగళూరు కు చెందిన ఒక విద్యార్థి శ్రీ స్టీవెన్ హ్యారిస్ ను ఆయన చిత్రించిన చిత్రలేఖనాలకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ తనకు ఒక ఉత్తరాన్ని పంపించారు. 20 యేళ్ల వయస్సు వున్న ఆ చిత్రకారుడు ప్రధాన మంత్రి కి ఒక లేఖ ను రాస్తూ, ప్రధాన మంత్రి తాలూకు సుందర వర్ణచిత్రాలు రెండిటిని ఆ లేఖ తో పాటు పంపారు. దీనికి ప్రధాన మంత్రి సమాధానమిస్తూ ఆ యువకుడి ని పొగడి, ఉత్సాహపరచారు.

సృజనాత్మక రంగాల లో యువత కు గల ఆసక్తి ని, అంకిత భావాన్ని చూసి తనకు సంతోషం వేస్తోందని ప్రధాన మంత్రి తన లేఖ లో పేర్కొన్నారు. ‘విషయాల ను లోతు గా పరిశీలించేటటువంటి మీ యొక్క ప్రతిభ కు మీ చిత్రలేఖనాలు అద్దం పడుతున్నాయి. ఎంతో చిన్న చిన్న భావాల ను సైతం సూక్ష్మ గ్రాహ్యత తో మీరు ఒడిసిపట్టుకున్న తీరు కు మనస్సు ఆనంద తరంగితం అవుతూంది’ అని ప్రధాన మంత్రి తన లేఖ లో రాశారు.

ప్రస్తుత కష్ట కాలం లో ప్రజల ఆరోగ్యం పట్ల, వారి సంక్షేమం పట్ల యువ చిత్రకారుడు వెలిబుచ్చిన అభిప్రాయాల ను ప్రధాన మంత్రి కొనియాడారు. ‘‘అందరికీ టీకాలు ఇప్పించేందుకు ఉద్దేశించిన ప్రచార కార్యక్రమం, క్రమశిక్షణ.. వీటితో పాటు 130 కోట్ల మంది భారతీయుల సమష్టి ప్రయాస లు మహమ్మారి కి వ్యతిరేకంగా మనం చేస్తున్న యుద్ధానికి బలాన్ని ఇస్తున్నాయి’’ అని ప్రధాన మంత్రి రాశారు.

సకారాత్మకత ను వ్యాపింపజేయడం కోసం శ్రీ స్టీవెన్ చేసిన ప్రయాస ను చూసి ప్రజలు ప్రేరణ ను పొందగలరన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

శ్రీ స్టీవెన్ తన లేఖ లో గత 15 సంవత్సరాలు గా తాను చిత్రలేఖనాన్ని కొనసాగిస్తున్నానని, మరి వివిధ స్థాయిల లో 100 కు పైగా పురస్కారాల ను గెలిచానని తెలియజేశారు. ప్రధాన మంత్రి తన కు ప్రేరణ గా నిలచారని ఆయన అభివర్ణిస్తూ, కరోనా కు వ్యతిరేకం గా పోరాడడం లో భాగం గా భారతదేశం నిర్వహిస్తున్న అందరికీ టీకాలు కార్యక్రమాన్ని ప్రశంసించారు.

స్టీవెన్ హారిస్ పంపించిన చిత్రలేఖనాల ను ఈ కింద చూడవచ్చును.

 

 

***



(Release ID: 1749359) Visitor Counter : 195