ప్రధాన మంత్రి కార్యాలయం

ఇజ్రాయిల్ ప్రధాని శ్రీ నఫ్తాలీ బెనెట్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 16 AUG 2021 9:20PM by PIB Hyderabad

ఇజ్రాయిల్ ప్రధాని శ్రీ నఫ్తాలీ బెనెట్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

ఈ సంవత్సరం మొదట్లో ఇజ్రాయిల్ ప్రధాని గా పదవీ బాధ్యతల ను స్వీకరించినందుకు శ్రీ బెనెట్ కు ప్రధాన మంత్రి మరో సారి తన అభినందనల ను వ్యక్తం చేశారు.  

ఇటీవలి కొన్నేళ్ల లో ఇరు దేశాల పరస్పర సంబంధాల లో చెప్పుకోదగినటువంటి ప్రగతి చోటు చేసుకోవడం పట్ల నేత లు సంతోషాన్ని ప్రకటించారు.  వ్యవసాయం, నీరు, రక్షణ, భ్రదత, సైబర్-సెక్యూరిటీ వంటి రంగాల లో ఇజ్రాయిల్ తో నెలకొన్న పటిష్టమైన సహకారాని కి భారతదేశం చాలా అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్లు ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

ప్రత్యేకించి నూతన ఆవిష్కరణ లు, ఉన్నత సాంకేతిక విజ్ఞానం వంటి రంగాల లో సహకారాన్ని మరింతగా విస్తృతపరచుకొనేందుకు అవకాశాలు ఉన్నాయని నేత లు ఇరువురు అంగీకరించారు.  వారు ఈ విషయం లో తీసుకోదగిన గట్టి  చర్యల ను గురించి చర్చించారు; అంతే కాక, రెండు దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు భారతదేశం- ఇజ్రాయిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా పెంపొందించుకొనేందుకు గాను ఒక మార్గ సూచీ ని రూపొందించే అంశంలో కృషి చేయాలని నేత లు నిర్ణయించారు.

భారతదేశానికి, ఇజ్రాయిల్ కు మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తరువాత వచ్చే ఏడాది లో 30వ వార్షికోత్సవం రానున్నదన్న సంగతి ని ప్రధాన మంత్రి గుర్తుకు తెస్తూ, భారతదేశాన్ని సందర్శించవలసిందిగా శ్రీ బెనెట్ కు ఆహ్వానం పలికారు.  

యూదుల పండుగ రోశ్ హశానా త్వరలో రానున్న సందర్భం లో ఇజ్రాయిల్ ప్రజల కు, శ్రీ బెనెట్ కు ప్రధాన మంత్రి తన అభినందనల ను, శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
 


 

***



(Release ID: 1746686) Visitor Counter : 182