ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గత 24 గంటల్లో 88.13 లక్షల టీకా డోసులు; ఒక రోజులో ఇదే రికార్డు


46% మంది వయోజనులకు మొదటి డోస్ పూర్తి ; రెండు డోసులూ తీసుకున్నవారు 13%

Posted On: 17 AUG 2021 1:18PM by PIB Hyderabad

టీకాల కార్యక్రమంలో భారత్ మరో కీలకమైన మైలురాయి దాటింది. ఆగస్టు 16 న ఒకే రోజులో అత్యధికంగా 88 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

ఇప్పుడు నడుస్తున్న కొత్త దశ టీకాల కార్యక్రమాన్ని ప్రధాని 2021 జూన్ 7 న ప్రకటించారు. కోవిడ టీకాకు అర్హులైన ప్రజలందరూ స్వచ్ఛందంగా టీకాలు వేయించుకోవాలని, ఇతరులను కూడా టీకాలకు ప్రోత్సహించాలని  పిలుపునిచ్చారు. ఈ రోజు సాధించిన ఈ రికార్డు స్థాయి టీకాలు కోవిడ మీద పోరాడుతున్న  ప్రభుత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం   టీకాల కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరిన్ని టీకాలు అందుబాటులో ఉండేట్టు చేయటం, 15 రోజులు ముందుగానే ఎంత పరిమాణంలో టీకాలు అందుబాటులో ఉండబోతున్నాయో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేయటం ద్వారా వారు సరైన ప్రణాళికల ద్వారా పంపిణీచేయటానికి వెసులుబాటు కల్పించింది.

ఆ విధంగా ఆగస్టు 16 నా ఒక్కరోజే 88.13 లక్షలకు పైగా టీకా డోసులు పంపిణీ చేయటం ద్వారా ఇప్పటివరకు ఇచ్చిన టీకాల సంఖ్య 55.47కోట్లు (55,47,30,609) దాటింది. రెండు డోసులూ తీసుకున్నవారు 13% మంది ఉన్నారు.  అంటే, వయోజనుల జనాభాలో 46% మంది మొదటి డోసు తీసుకున్నారు.

 

****


(Release ID: 1746685) Visitor Counter : 204