ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ యువజన విలువిద్యా క్రీడోత్సవాల్లో పలు పతకాలను సాధించిన భారతీయ బృందానికి ప్రధాని అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
15 AUG 2021 10:30PM by PIB Hyderabad
రోక్లాలో నిర్వహించిన ప్రపంచ యువజన విలువిద్యా క్రీడాపోటీల్లో భారతదేశ క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. 8 బంగారు పతకాలతో కలుపుకొని మొత్తం 15 పతకాలను సాధించారు. భారతీయ విలువిద్య క్రీడాకారుల బృందాన్ని అభినందిస్తూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఎనిమిది బంగారు పతకాలతో కలుపుకొని మొత్తం 15 పతకాలను సాధించిన భారతీయ విలువిద్యా క్రీడాకారుల బృందానికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. వారు ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మీరు సాధించిన విజయం అనేక మంది ఔత్సాహిక క్రీడాకారులకు స్ఫూర్తిని అందిస్తుందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన ట్వీట్ లో తెలిపారు.
***
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1746239)
సందర్శకుల సూచీ సంఖ్య : : 161
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada