ప్రధాన మంత్రి కార్యాలయం

ఆగస్టు 12న ‘ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్’ లో పాల్గొననున్న ప్రధాన మంత్రి

Posted On: 11 AUG 2021 1:14PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని 2021 ఆగస్టు 12 న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘ఆత్మ నిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో పాల్గొని, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- నేశనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిశన్ (డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్) లో భాగం గా ప్రోత్సాహం లభించిన మహిళా స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జి) సభ్యులు/ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తో మాట్లాడనున్నారు.  ఇదే కార్యక్రమం లో వ్యవసాయ సంబంధ జీవనోపాధుల సార్వజనీకరణ అంశం పై వివరణ నిచ్చే పుస్తకం తో పాటు దేశ వ్యాప్త ఎస్ హెచ్ జి మహిళా సభ్యుల సాఫల్య గాథ ల సంకలన గ్రంథాన్ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు.

నాలుగు లక్షల కు పైగా ఎస్ హెచ్ జి లకు దాదాపు 1625 కోట్ల రూపాయల మూలధనీకరణ సంబంధి నిధుల ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేయనున్నారు. దీనికి అదనం గా, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ కు చెందిన పిఎమ్ ఫార్మలైజేశన్ ఆఫ్ మైక్రోఫూడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైసెస్ (పిఎమ్ఎఫ్ఎమ్ఇ) పథకం లో భాగం గా 7500 స్వయం సహాయ సమూహాల సభ్యుల కోసం 25 కోట్ల రూపాయల సీడ్ మనీ తో పాటు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ నిఒ స్) డెబ్బై ఐదింటి కి నిధుల రూపం లో 4.13 కోట్ల రూపాయల ను కూడా ఆయన విడుదల చేస్తారు.

ఈ సందర్భం లో గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ  గిరిరాజ్ సింహ్, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పశుపతి కుమార్ పారస్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రులు సాధ్వి నిరంజన్ జ్యోతి, శ్రీ ఫగ్గన్ సింహ్ కులస్తే, పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి  శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్ లు కూడా హాజరు అవుతారు.


డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్ ను గురించి

 గ్రామీణ ప్రాంతాల లోని పేద కుటుంబాల ను దశల వారీగా స్వయం సహాయ సమూహాల లో చేరే విధం గా చైతన్యపరచాలని, వారు వేరు వేరు బతుకు తెరువుల ను అనుసరించేందుకు వారికి దీర్ఘకాలిక మద్దతు ను అందించాలని, వారి ఆదాయాల ను, వారి జీవన నాణ్యత ను మెరుగుపరచాలని డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్ లక్ష్యం గా పెట్టుకొంది.  ఈ మిశన్ తాలూకు కార్య్రక్రమాల లో చాలావరకు కార్యక్రమాల ను స్వయం సమూహాల మహిళ లు వారంతట వారే  అమలు లోకి తీసుకు వస్తూ, ఆయా కార్యక్రమాల లో ప్రగతి కి కారకులు అవుతున్నారు.  కృషీ సఖి, పశు సఖి, బ్యాంకు సఖి, బీమా సఖి, బ్యాంకింగ్ కరెస్పాండెంట్ సఖి.. ఇలాగ వివిధ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ గా వారికి శిక్షణ ను ఇవ్వడమైంది.  ఈ మిశన్ జాగృతి ని కలుగజేయడం ద్వారా గృహ హింస, మహిళల్లో విద్యావ్యాప్తి లతో పాటు మహిళల కు సంబంధించిన ఇతరేతర సమస్య లు, పోషక విలువల తో కూడిన ఆహారం, పారిశుద్ధ్యం, ఆరోగ్యం వంటి అంశాల లో ఎలా నడుచుకోవాలి అనే విషయం లో మెరుగైన పద్ధతుల ను ఎస్ హెచ్ జి మహిళల కు సూచించడం ద్వారా వారి సశక్తీకరణ కు కూడా కృషి చేస్తున్నది.

 

 

***
 



(Release ID: 1744824) Visitor Counter : 277