ప్రధాన మంత్రి కార్యాలయం

ఇల్లు, విద్యుత్తు, టాయిలెట్లు, గ్యాస్, రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలల వంటి ప్రాథమిక సౌకర్యాల లేమి మహిళల పైన, మరీ ముఖ్యం గా పేద మహిళల పైనప్రభావాన్ని చూపింది: ప్రధాన మంత్రి


ఇంటి కిసంబంధించిన, వంటింటి కి సంబంధించిన సమస్య లు మొదట పరిష్కారం అయితేనే మన కుమార్తె లుఇంటి నుంచి, వంట గది నుంచి బయటకు రాగలిగి దేశ నిర్మాణం లో విస్తృత స్థాయి తోడ్పాటు నుఅందించగలుగుతారు: ప్రధాన మంత్రి

ప్రస్తుతంస్వాతంత్ర్యం తాలూకు 75వ సంవత్సరం లో మనం అడుగుపెడుతున్న వేళ, గత 7 దశాబ్దాలలో ప్రగతి ని మనం గమనిస్తూ ఉన్న వేళ.. ఈ ప్రాథమిక సమస్యల ను దశాబ్దాల కిందటేతీర్చి ఉండి ఉండాల్సిందనే భావన తప్పక కలుగుతుంది: ప్రధాన మంత్రి

గడచినఆరేడేళ్ల లో మహిళ ల సశక్తీకరణ తాలూకు వివిధ సమస్యల కు పరిష్కారాల ను సాధించడం కోసంప్రభుత్వం ఒక ఉద్యమం తరహా లో కృషి చేసింది: ప్రధాన మంత్రి

సోదరీమణుల ఆరోగ్యం, సౌకర్యం, సశక్తీకరణ ల తాలూకు సంకల్పానికి ఉజ్జ్వల యోజన ద్వారా గొప్ప ఉత్తేజం లభించింది: ప్రధాన మంత్రి

Posted On: 10 AUG 2021 9:35PM by PIB Hyderabad

మహిళ ల సశక్తీకరణ కు సంబంధించి ప్రభుత్వం తాలూకు దృష్టి కోణం ఎలా ఉన్నదీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సంపూర్ణం గా వివరించారు. ఇళ్ల నిర్మాణం, విద్యుత్తు, మరుగుదొడ్లు, గ్యాసు, రోడ్డు లు, ఆసుపత్రులు, పాఠశాల ల వంటి కనీస సౌకర్యాల లేమి మహిళల పైన, మరీ ముఖ్యంగా పేద మహిళల పైన అతి తీవ్రమైన ప్రభావాన్ని చూపింది అని ఆయన అన్నారు. ప్రస్తుతం మనం స్వాతంత్ర్యం తాలూకు 75వ సంవత్సరం లో అడుగుపెడుతున్న వేళ లో, అలాగే గత ఏడు దశాబ్దాల లో చోటు చేసుకొన్న ప్రగతి ని మనం గమనిస్తూ ఉన్న వేళ లో.. ఈ సమస్యల ను దశాబ్దాల కిందటే పరిష్కరించి ఉండి ఉండాల్సింది అనే భావన కలిగి తీరుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘‘ఉజ్వల 2.0’’ ను ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా లో ప్రారంభించిన తరువాత ప్రసంగించారు.

ఇంటి పై కప్పు నీటి చుక్కల తో కారుతూ ఉండడం, విద్యుత్తు సౌకర్యం లేకపోవడం, కుటుంబం లో సభ్యులు జబ్బు పడుతూ ఉండడం, బహిర్భూమి కి వెళ్లి రావడం కోసం చీకటి పడే వరకు వేచి ఉండవలసి రావడం, బడుల లో మరుగుదొడ్డి సదుపాయం కొరవడటం అనేవి మన మాతృమూర్తుల పై, మన పుత్రికల పై ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రసరింపచేస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. మన మాతృమూర్తులు పొగ, వేడిమి ల బారిన పడి సతమతం కావడాన్ని మన తరం గమనిస్తూ వచ్చిందని చెబుతూ ఆయన తన స్వీయ అనుభవాన్ని గురించి ప్రస్తావించారు.

ఈ ప్రాథమిక అవసరాలను తీర్చడానికే మన శక్తి ని ఖర్చు చేస్తూ ఉంటే గనక మన స్వాతంత్ర్యం తాలూకు 100 సంవత్సరాల బాట లో మనం ఏ విధం గా ముందుకు సాగిపోగలం? అని ప్రధాన మంత్రి ప్రశ్నించారు. ఒక కుటుంబం గాని, లేదా ఒక సమాజం గాని కనీస సౌకర్యాల కోసమే సంఘర్షణ కు లోనవుతూ ఉన్నప్పుడు వారు పెద్ద పెద్ద కలల ను కని, మరి వాటిని ఎలా పండించుకోగలుగుతారు? అని ఆయన అన్నారు. ఒక సమాజం తన స్వప్నాల ను సాకారం చేసుకోవాలి అంటే అందుకు కలల ను నెరవేర్చుకోగలుగుతాం అనేటటువంటి భావన కలగడం అనేది అత్యవసరం అని ఆయన అన్నారు. ఆత్మ విశ్వాసం లోపించినప్పుడు ఒక దేశం ఆత్మ నిర్భర దేశం గా ఎలా మారగలుగుతుంది ? అని ప్రధాన మంత్రి ప్రశ్నించారు.

2014 వ సంవత్సరం లో మనం ఈ ప్రశ్నల ను మనకే వేసుకొన్నాం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సమస్యల ను ఒక నిర్ధిష్ట కాలంలోగా తీర్చుకోవలసిన అవసరం ఉంది అనేది సుస్పష్టం గా ఉండిందన్నారు. ఇంటి కి, వంటింటి కి సంబంధించిన సమస్యలు ముందుగా పరిష్కారం అయితేనే మన కుమార్తెలు ఇంటి నుంచి, వంట గది నుంచి బయట కు వచ్చి దేశ నిర్మాణం లో విరివి గా తోడ్పడగలుగుతారు అని ఆయన చెప్పారు. ఈ కారణం గా, గత 6-7 ఏళ్ల లో వేరు వేరు సమస్యల కు పరిష్కారాల ను కనుగొనడం కోసం ఒక ఉద్యమ తరహా లో ప్రభుత్వం కృషి చేసిందని ఆయన అన్నారు.

ఆ కోవ కు చెందిన అనేక ప్రమేయాల ను గురించి ఆయన వివరించారు. వాటి లో..

· దేశ వ్యాప్తం గా కోట్ల కొద్దీ మరుగుదొడ్ల ను స్వచ్ఛ్ భారత్ మిశన్ లో భాగం గా నిర్మించడమైంది.

· రెండు కోట్లకు పైగా ఇళ్లను పేద కుటుంబాల కోసం నిర్మించడమైంది. ఆ గృహాలలో చాలా వరకు మహిళల పేరిటే ఉన్నాయి.

· గ్రామీణ రహదారుల నిర్మాణం

· 3 కోట్ల కుటుంబాలు ‘సౌభాగ్య యోజన’ లో భాగం గా విద్యుత్తు కనెక్షన్ లను పొందాయి.

· ఆయుష్మాన్ భారత్50 కోట్ల మంది ప్రజల కు 5 లక్షల రూపాయల వరకు విలువ చేసే ఉచిత వైద్య చికిత్స తాలూకు భరోసా ను అందుకొన్నాయి.

· గర్భవతుల కు టీకాకరణ కు, పోషకాహారానికి గాను ’మాతృ వందన యోజనలో భాగం గా నగదు ను నేరు గా బదలాయించడం జరుగుతున్నది

· కరోనా కాలం లో మహిళ ల జన్ ధన్ ఖాతాల లో 30 వేల కోట్ల రూపాయల ను ప్రభుత్వం జమ చేసింది.

· జల్ జీవన్ మిశన్లో భాగం గా గొట్టాల ద్వారా సరఫరా అయ్యే నీటి ని మన సోదరీమణులు అందుకొంటున్నారు.

ఈ పథకాలు మహిళల జీవితాల లో ఒక బ్రహ్మాండమైనటువంటి పరివర్తన ను తీసుకు వచ్చాయి అని ఆయన అన్నారు.

ఉజ్జ్వల యోజన ద్వారా సోదరీమణుల ఆరోగ్యం, సౌకర్యం, సశక్తీ కరణల తాలూకు సంకల్పం గొప్ప ఉత్తేజాన్ని అందుకొంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ పథకం ఒకటో దశ లో పేదలు, దళితులు, ఆదరణ కు దూరంగా ఉండిపోయిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీ కుటుంబాల కు చెందిన 8 కోట్ల మంది మహిళల కు గ్యాస్ కనెక్శన్ లను ఉచితం గా ఇవ్వడం జరిగిందన్నారు. ఉచిత గ్యాస్ కనెక్శన్ తాలూకు ప్రయోజనాన్ని కరోనా మహమ్మారి కాలం లో మనం గమనించామని ఆయన అన్నారు. వ్యాపారం నిలచిపోయి, సరుకుల రవాణా పై ఆంక్షలు అమలైన సందర్బం లో సైతం కోట్ల కొద్దీ పేద ప్రజలు గ్యాస్ సిలిండర్ లను నెలల తరబడి ఉచితం గా అందుకొన్నారు అని ఆయన అన్నారు. ఉజ్జ్వల లేకపోయినట్లయితే ఈ పేద సోదరీమణుల స్థితి ఎలా ఉండేదో ఊహించండి అని ప్రధాన మంత్రి అన్నారు.

 

***


DS

 


(Release ID: 1744736) Visitor Counter : 202