ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 50.86 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

అత్యధికంగా 97.40% చేరిన కోలుకున్నవారి శాతం
గత 24 గంటల్లో 35,499 కొత్త కోవిడ్ కేసులు
ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 4,02,188; మొత్తం కేసుల్లో 1. 26%
రోజువారీ పాజిటివిటీ 2.59%; 14 రోజులుగా 3% లోపే

Posted On: 09 AUG 2021 10:15AM by PIB Hyderabad

భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 50.86   కోట్లు దాటింది. 58,79,068  శిబిరాల ద్వారా మొత్తం 50,86,64,759 టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది. గత 24 గంటలలో 16,11,590 టీకాలిచ్చారు.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి:      

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,03,32,881

 

రెండో డోస్

79,82,037

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,82,17,136

 

రెండో డోస్

1,17,58,909

18-44 వయోవర్గం

మొదటి డోస్

17,67,66,853

 

రెండో డోస్

1,20,24,776

45-59 వయోవర్గం

మొదటి డోస్

11,18,71,679

 

రెండో డోస్

4,26,95,084

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

7,84,79,044

 

రెండో డోస్

3,85,36,360

మొత్తం

 

50,86,64,759

 సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు   చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి శాతం గత 24 గంటల్లో 97.40% కు కోలుకోవటం విశేషం. కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంకి కోలుకున్నవారి శాతం ఇదే అత్యధికం

కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటి దాకా 3,11,39,457 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 39686 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి శాతం  97.40% అయింది.

 గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  35499 కొత్త కేసులు నమోదయ్యాయి. 43  రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది...

ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో  ఉన్నవారు 4,02,188 మంది. చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.26% మాత్రమే.

 

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 13,71,871 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 48 కోట్లకు పైగా (48,17,67,232) అయ్యాయి.

ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.35% కాగా రోజువారీ పాజిటివిటీ  2.59  %  అయింది. వరుసగా14 రోజులుగా 3% లోపు,  63 రోజులుగా ఇది 5% లోపే ఉంటోంది.

 

 

****

 

 



(Release ID: 1743959) Visitor Counter : 186