ప్రధాన మంత్రి కార్యాలయం

మహిళలహాకీ లో ఒక పతకాన్ని మనం కొద్దిలో చేజార్చుకున్నాం, అయితే ఈజట్టు ‘న్యూ ఇండియా’ స్ఫూర్తి కి అద్దం పడుతోంది: ప్రధాన మంత్రి

Posted On: 06 AUG 2021 10:01AM by PIB Hyderabad

మహిళల హాకీ లో ఒక పతకాన్ని మనం కొద్దిలో చేజార్చుకున్నాం; అయితే ‘‘మనదైన అత్యుత్తమ ప్రతిభ ను కనబరిచి సరికొత్త సీమల లో ప్రవేశించడం’’ అనే న్యూ ఇండియాతాలూకూ స్ఫూర్తి కి ఈ జట్టు అద్దం పట్టింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020 లో మన మహిళల హాకీ జట్టు ఇచ్చిన గొప్ప ప్రదర్శన ను మనం ఎల్లప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటాం అని కూడా ఆయన అన్నారు.

మహిళల హాకీ లో ఒక పతకాన్ని గెలుచుకోవడాన్ని మనం కొద్దిలో కోల్పోయాం; అయితే, ఈ జట్టు ‘‘మనదైన అత్యుత్తమ ప్రతిభ ను కనబరిచి సరికొత్త సీమల లో ప్రవేశించడం’’ అనే న్యూ ఇండియాతాలూకూ స్ఫూర్తి కి అద్దం పడుతోంది. మరింత ముఖ్యం అయిన విషయం ఏమిటి అంటే అది #Tokyo2020 లో వారి సాఫల్యం భారతదేశం యువ పుత్రికల కు హాకీ ని ఎంచుకొని, ఆ క్రీడ లో రాణించాలి అనే ప్రేరణ ను అందిస్తుంది అనేదే. ఈ జట్టు ను చూస్తే గర్వం గా ఉంది ’’ అని ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో పేర్కొన్నారు.

 

 

***

DS/SH



(Release ID: 1743120) Visitor Counter : 171