ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కు, భారతదేశం లో ఆస్ట్రేలియా ప్రధాని కి ప్రత్యేక వ్యాపార దూత శ్రీ టోనీ ఎబట్ కు మధ్య జరిగిన సమావేశం

Posted On: 05 AUG 2021 6:24PM by PIB Hyderabad

ఆస్ట్రేలియా పూర్వ ప్రధాని శ్రీ టోనీ ఎబట్‌  తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.  శ్రీ టోనీ ఎబట్ ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి కి ప్రత్యేక వ్యాపార దూత హోదా లో  2021 ఆగష్టు 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు భారతదేశం లో పర్యటించడం కోసం విచ్చేశారు.

నేతలు ఇద్దరూ భారతదేశం-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకొనేందుకు  ద్వైపాక్షిక వ్యాపారం, పెట్టుబడి, ఆర్థిక సహకారాన్ని మరింత పెంచుకొనే  పద్ధతుల ను గురించి చర్చించారు.

వారు భారతదేశాని కి, ఆస్ట్రేలియా కు మధ్య ఆర్థిక సహకారం పెంపొందడం వల్ల ఇరు దేశాల కు కోవిడ్-19 మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక సవాళ్ల ను సరి అయిన విధం గా ఎదుర్కోవడం లో తోడ్పాటు లభిస్తుందని స్పష్టం చేశారు.  దీనితో పాటుగా వారికి ఒక స్థిరమైనటువంటి, సురక్షితమైనటువంటి, సంపన్నమైనటువంటి ఇండో-పసిఫిక్ ప్రాంతం గురించిన తమ భాగస్వామ్య దార్శనికత ను అమలుపరచడం లో కూడాను సహాయం అందుతుందని పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో భారతదేశం-ఆస్ట్రేలియా సంబంధాల లో చెప్పుకోదగ్గ వృద్ధి చోటు చేసుకోవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  మరి ఈ ప్రయాణం లో,  ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, పూర్వ ప్రధాని శ్రీ టోనీ ఎబట్ ల మహత్వపూర్ణమైన సమర్ధన ను కూడా ఆయన ప్రశంసించారు.

గడచిన సంవత్సరం లో ప్రధాని శ్రీ మారిసన్‌ తో కలసి తాను పాల్గొన్న వర్చువల్ సమిట్‌ ను కూడా ఈ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తుకు తెచ్చుకొన్నారు.  స్థితులను పరిగణన లోకి తీసుకొని వీలయినంత త్వరలోనే ప్రధాని శ్రీ మారిసన్‌ కు భారతదేశం లో ఆతిథ్యాన్ని ఇవ్వాలని ఉంది అంటూ తన అభిలాష ను ఆయన మరో సారి వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ ల మధ్య 2020 జూన్ 4 న జరిగిన వర్చువల్ సమిట్ లో ద్వైపాక్షిక సంబంధాల ను ఒక సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయి కి పెంచడం జరిగింది. దీనిలో భాగం గా భారతదేశం, ఆస్ట్రేలియా లు పరస్పర ప్రయోజనార్థం వ్యాపారం,  పెట్టుబడుల ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి వచనబద్ధత ను ప్రకటించారు. అంతేకాకుండా ఒక ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక  సహకారపూర్వక ఒప్పందం (సిఇసిఎ) పై మరోసారి జతపడాలనే నిర్ణయాన్ని కూడా తీసుకోవడమైంది. శ్రీ టోనీ ఎబట్ ప్రస్తుత పర్యటన ఈ భాగస్వామ్య మహత్త్వాకాంక్ష కు అద్దం పడుతోంది.


 

***


(Release ID: 1743119)