ప్రధాన మంత్రి కార్యాలయం

2020 టోక్యోఒలింపిక్స్ 2020 లో బాక్సింగ్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు లవ్ లీనా బోర్ గోహేన్ నుఅభినందించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 04 AUG 2021 12:04PM by PIB Hyderabad

టోక్యో ఒలింపిక్స్ 2020 లో బాక్సింగ్ క్రీడ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు లవ్ లీనా బోర్ గోహేన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఆమె పట్టుదల, దృఢ సంకల్పం ప్రశంసనీయమైనవి అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

‘‘ చక్క గా పోరాడారు @LovlinaBorgohai! బాక్సింగ్ రింగ్ లో ఆమె సాధించిన సఫలత భారతదేశం లో ఎంతో మంది కి ప్రేరణ ను ఇస్తుంది. ఆమె కనబరచిన పట్టుదల, ఆమె దృఢ సంకల్పం ప్రశంసించదగ్గవి. కాంస్యాన్ని గెలుచుకొన్నందుకు ఆమె కు ఇవే అభినందనలు. ఆమె భావి ప్రయత్నాలు ఫలించాలి అని ఆకాంక్షిస్తున్నాను. #Tokyo2020 ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1742209) సందర్శకుల సూచీ సంఖ్య : : 236