ప్రధాన మంత్రి కార్యాలయం

టోక్యో 2020 లో మన పురుషుల హాకీ జట్టు వారి అత్యుత్తమ ప్రదర్శన ను కనబరిచారు. మరి ముఖ్యమైంది అదే: ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 AUG 2021 11:38AM by PIB Hyderabad

టోక్యో 2020 లో మన పురుషుల హాకీ జట్టు వారి అత్యుత్తమమైన ఆట తీరు ను ప్రదర్శించారు. మరి అదే మఖ్యమైంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. తరువాతి పోటీ లో వారు రాణించాలని, అలాగే వారి భావి ప్రయాస లు ఫలించాలని కూడా ఆయన ఆకాంక్షించారు.

‘‘ విజయాలు, పరాజయాలు అనేవి జీవితం లో ఒక భాగం. మన పురుషుల హాకీ జట్టు టోక్యో 2020 లో వారి అత్యుత్తమమైనటువంటి ఆట తీరు ను కనబరచారు. ముఖ్యమైంది అదే కదా. తరువాతి స్పర్ధ లోను, వారి భావి ప్రయత్నాల లోను జట్టు రాణించాలి అని కోరుకుంటున్నాను. మన క్రీడాకారుల ను చూసుకొని భారతదేశం గర్వపడుతున్నది ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1741829) సందర్శకుల సూచీ సంఖ్య : : 214