ప్రధాన మంత్రి కార్యాలయం

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జూలై 31న ఐపీఎస్ ప్రొబేషనర్లతో సంభాషించనున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 30 JUL 2021 10:06PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2021 జూలై 31వ తేదీన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ఆయన  ప్రోబేషనర్లతో కాసేపు ముచ్చటిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ కూడా పాల్గొంటారు.

 

ఎస్.వి.పి.ఎన్.పి.ఎ  గురించి...

   సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణ సంస్థ. ఇండియన్ పోలీస్ సర్వీసులో ప్రవేశించే అధికారులకు శిక్షణ ఇవ్వడంతోపాటు  ఇప్పటికే సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారులకు వివిధ కోర్సుల ద్వారా ఈ సంస్థ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

                     

***


(रिलीज़ आईडी: 1740986) आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada