ప్రధాన మంత్రి కార్యాలయం

‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగంలో చండీగఢ్‌లోని ఫుడ్‌స్టాల్‌ యజమానికి ప్రధాని ప్రశంస

Posted On: 25 JUL 2021 4:13PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నెలవారీ ‘మన్‌ కీ బాత్‌’ రేడియో కార్యక్రమం ద్వారా ఇవాళ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ చండీగఢ్‌లోని ఓ ఫుడ్‌స్టాల్‌ యజమాని సంజయ్‌ రాణా చొరవను ప్రశంసించారు. ఈ మేరకు కోవిడ్‌-19 టీకాలు తీసుకునేలా ప్రజలకు ప్రేరణ ఇవ్వడంలో అతని చొరవను కొనియాడారు. కోవిడ్‌ టీకా తీసుకున్నవారికి ‘షోలే భటూరే’ వంటకాన్ని రాణా ఉచితంగా ఇవ్వాలన్న తన కుమార్తె, మేనకోడలు సూచించగా అందుకు అంగీకరించాడు.

   చండీగఢ్‌లోని సెక్టర్‌-29లో సంజయ్‌ రాణా సైకిలుమీద ‘షోలే భటూరే’ అమ్ముతుంటాడు. ఈ క్రమంలో టీకా వేసుకున్న రోజున ఆ మేరకు ఆధారం చూపినవారికి ఈ వంటకాన్ని ఉచితంగా అందజేసేవాడని ప్రధానమంత్రి వెల్లడించారు. దీన్నిబట్టి డబ్బుకన్నా సమాజ సంక్షేమం, సేవాస్ఫూర్తి, కర్తవ్య నిర్వహణలే మిన్న అని రుజువు చేశాడంటూ సదరు ఫుడ్‌స్టాల్‌ యజమాని చొరవను ఆయన మరోసారి ప్రశంసించారు.

 

***


(Release ID: 1738912) Visitor Counter : 177