ప్రధాన మంత్రి కార్యాలయం

రాజ్యసభలో నూతన మంత్రులను పరిచయం చేస్తున్న సందర్భంగా ప్రధాన మంత్రి ప్రారంభ వ్యాఖ్యలు

Posted On: 19 JUL 2021 3:15PM by PIB Hyderabad

 

గౌరవనీయులైఛైర్మన్ గారు,

 

నూతన మంత్రివర్గ సభ్యులను ఈ సభకు పరిచయం చేయాలని మీరు నన్ను ఆదేశించారు.

ఈ రోజు, రైతు కుటుంబ నేపథ్యం ఉన్న పిల్లలను ఈ గౌరవనీయ సభలో ఈ రోజు మంత్రులుగా పరిచయం చేస్తున్న సందర్భం ది, కానీ కొంతమంది చాలా బాధపడుతున్నారు.

ఈ రోజు ఈ సభలో మహిళా మంత్రులను పరిచయం చేస్తోంటే, మహిళా వ్యతిరేక మనస్తత్వం ఏమిటి అంటే, ఈ సభలో వారి పేర్లను వినడానికి కూడా వారు సిద్ధంగా లేరు, వారిని సభకి పరిచయం చేయడానికి సిద్ధంగా లేరు.

గౌరవనీయులైఛైర్మన్ గారు,

షెడ్యూల్ తెగకు చెందిన మన ఎంపిలు పెద్ద సంఖ్యలో సహచర మంత్రులు అయ్యారు. ఈ గౌరవనీయ సభలో గిరిజన మంత్రులను పరిచయం చేయడం కూడా వారికి ఇష్టం లేనట్లుంది. వారిపై ఎందుకో అంత కోపం.

 గౌరవనీయులైఛైర్మన్ గారు,

ఈ సభలో పెద్ద సంఖ్యలో దళిత మంత్రులను పరిచయం చేయడం జరుగుతోంది. దళిత వర్గానికి చెందిన ప్రతినిధుల పేర్లను వినడానికి వారు సిద్ధంగా లేరు. దళితులను కీర్తించడానికి సిద్ధంగా లేని, గిరిజనులను కీర్తించడానికి సిద్ధంగా లేని, రైతు కొడుకును కీర్తించడానికి సిద్ధంగా లేని ఈ మనస్తత్వం ఏమిటి? మహిళలను గౌరవించటానికి సిద్ధంగా లేని ఈ మనస్తత్వం ఏమిటి. ఈ రకమైన వికృత మనస్తత్వాన్ని సభ మొదటిసారి చూసింది.

కాబట్టి, గౌరవనీయ ఛైర్మన్ గారు,

పరిచయం చేయడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశానికి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, కాని గౌరవ ఛైర్మన్ గారు , మంత్రి మండలి లో కొత్తగా నియమించబడిన సభ్యులను రాజ్యసభలో పరిచయం చేసినట్లుగానే పరిగణించాలి.

                            

 

 

*******


(Release ID: 1737010)