ప్రధాన మంత్రి కార్యాలయం

నందుర్ బార్ లో జ‌రిగిన విషాద ఘ‌ట‌న లో ప్రాణ‌న‌ష్టం వాటిల్లడం ప‌ట్ల‌ సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి


ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు

Posted On: 18 JUL 2021 11:23PM by PIB Hyderabad

మ‌హారాష్ట్ర లోని నందుర్ బార్ లో జ‌రిగిన ఒక ప్ర‌మాదం లో ప్రాణ‌న‌ష్టం వాటిల్లడం ప‌ట్ల‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.  ఈ ఘ‌ట‌న లో గాయ‌ప‌డ్డ‌ వ్యక్తులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని తాను ప్రార్థిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  మృతుల ద‌గ్గ‌రి సంబంధికుల కు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వంతు న‌గాయ‌ప‌డిన వారికి 50,000 రూపాయ‌ల వంతు న పిఎమ్‌ఎన్ఆర్ఎఫ్  నుంచి ప‌రిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయ‌న ప్ర‌క‌టించారు.

 

 ‘‘ మ‌హారాష్ట్ర లోని నందుర్ బార్ నుంచి ఒక విషాద‌క‌ర‌మైన వార్త వ‌చ్చింది.  ఒక ప్ర‌మాద ఘ‌ట‌న‌ లో త‌మ ప్రియ‌త‌ముల ను కోల్పోయిన వారికి ఇదే నా సంతాపం.  గాయ‌ప‌డిన వారు కోలుకోవాల‌ని ఆ ఈశ్వ‌రుడి ని ప్రార్థిస్తున్నాను.  మృతుల ద‌గ్గ‌రి సంబంధికుల కు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున‌గాయ‌ప‌డిన వారికి 50,000 రూపాయ‌ల చొప్పున పిఎమ్‌ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ఇవ్వ‌డం జ‌రుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi ’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.


 

DS


(Release ID: 1736691) Visitor Counter : 168