ప్రధాన మంత్రి కార్యాలయం

ముంబయి లో గోడ కూలిన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


పిఎమ్ఎన్ఆర్ ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించారు

Posted On: 18 JUL 2021 10:47AM by PIB Hyderabad

ముంబయి లోని చెంబూరు, విక్రోలీ లలో గోడ లు కూలి ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.  మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున , గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని కూడా ఆయన ప్రకటించారు.

పిఎమ్ ఒ నుంచి ప్రధాన మంత్రి జారీ చేసిన వరుస ట్వీట్ ల లో

‘‘ముంబయి లోని చెంబూరు, విక్రోలీ లలో గోడలు కూలినందువల్ల ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలిసి దు:ఖించాను.  ఈ విషాద ఘడియ లో, ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి అంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి @narendramodi.’’

ముంబయి లో గోడలు కూలి జరిగిన విషాద ఘటన లలో ప్రాణాల ను కోల్పోయిన వారి దగ్గరి సంబంధికుల కు  2 లక్షల రూపాయల వంతున పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి అందించడం జరుగుతుంది.  గాయపడ్డ వారికి 50,000 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపారు.

 

 

 

***

DS/SH



(Release ID: 1736644) Visitor Counter : 140