ప్రధాన మంత్రి కార్యాలయం
వారాణసీ లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; మరికొన్ని అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన చేశారు
మహమ్మారి కి వ్యతిరేకం గా పోరాడటంలో ఉత్తర్ ప్రదేశ్ ను, కాశీ ని అవిచేసిన ప్రయత్నాల కు గాను ఆయన ప్రశంసించారు.
పూర్వాంచల్ కు ఒక ప్రధానమైన వైద్యకేంద్రం గా కాశీ మారుతోంది: ప్రధానమంత్రి
గంగా మాత శుద్ధి, కాశీ శోభ ఒక ఆకాంక్షే కాదు ప్రాధాన్యం కూడాను: ప్రధాన మంత్రి
ఈ ప్రాంతం లో 8,000 కోట్ల రూపాయల విలువైన పథకాల తాలూకుపనులు జరుగుతూ ఉన్నాయి: ప్రధాన మంత్రి
దేశం లో ఒక అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానంగా ఉత్తర్ ప్రదేశ్ చాలా వేగం గా ఎదుగుతోంది: ప్రధాన మంత్రి
చట్ట పాలన, అభివృద్ధి పైన శ్రద్ధ.. ఇవి పథకాల ప్రయోజనాల ను ఉత్తర్ ప్రదేశ్ప్రజలు అందుకొనేటట్టు చూస్తున్నాయి: ప్రధానమంత్రి
వైరస్ విషయం లో జాగరూకత తో ఉండవలసిందిగా ఉత్తర్ ప్రదేశ్ ప్రజల కు ప్రధాన మంత్రి గుర్తు చేశారు
Posted On:
15 JUL 2021 1:18PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుమారు 744 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ధి పథకాల ను వారాణసీ లో ప్రారంభించారు. మరికొన్ని అభివృద్ధి పథకాల కు ఆయన శంకుస్థాపన లు కూడా చేశారు. ఈ పథకాల లో బిహెచ్‌యు లో 100 పడక ల ఎమ్‌సిహెచ్ విభాగం, గొదౌలియా లో వాహనాల నిలుపుదల కు ఉద్దేశించిన బహుళ తలాల సదుపాయం, గంగా నది ప్రాంతం లో పర్యటన అభివృద్ధి కి రొ-రొ వెసల్స్ తో పాటు వారాణసీ గాజీపుర్ రాజమార్గం లో మూడు దోవ లతో కూడిన ఫ్లైఓవర్ బ్రిడ్జి సహా వేరు వేరు పబ్లిక్ పథకాలు, పనులు ఉన్నాయి.
ఆయన 839 కోట్ల రూపాయల విలువైన అనేక ప్రాజెక్టుల కు శంకుస్థాపన లు కూడా చేశారు. ఈ పథకాల లో సెంటర్ ఫార్ స్కిల్ ఎండ్ టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ ఎండ్ టెక్నాలజీ (సిఐపిఇటి), జల్ జీవన్ మిశన్ లో భాగమైన 143 గ్రామీణ పథకాలు, కర్ఖియాయోన్ లో మామిడి, కూరగాయల సమీకృత ప్యాక్ హౌస్ లు కూడా ఉన్నాయి.
జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, రూపు ను మార్చుకొన్న కరోనా వైరస్ పూర్తి శక్తి తో విరుచుకుపడిన గత కొన్ని నెలల కాలం ఎంతో కష్టం గా గడిచిందని గుర్తు కు తెచ్చారు. సవాలు ను ఎదుర్కోవడం లో ఉత్తర్ ప్రదేశ్, కాశీ ల ప్రయత్నాల ను ప్రధాన మంత్రి హర్షించారు. మహమ్మారి ని ఎదుర్కోవడం లో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రయాసల ను ఆయన పొగిడారు. కాశీ లో ఏర్పాట్లను చేయడానికి రాత్రనక, పగలనక పాటుపడిన కరోనా యోధుల యావత్తు బృందాన్ని, అలాగే పరిపాలన యంత్రాంగాన్ని, కాశీ లోని తన జట్టు ను ఆయన మెచ్చుకొన్నారు. ‘‘కఠినమైన దినాల లో సైతం కాశీ తాను ఎన్నటికీ ఆగిపోయేది లేదని, అలసట ఎరుగనని నిరూపించుకొంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సెకండ్ వేవ్ ను ఇదివరకు ఎన్నడూ లేని విధం గా సంబాళించడాన్ని మునుపు జపనీస్ ఎన్‌సెఫలైటిస్ తరహా వ్యాధులు విజృంభించిన ఘటనల తో ఆయన పోలుస్తూ అప్పటికీ, ఇప్పటికీ ఎంత తేడా ఉన్నదీ వివరించారు. వైద్యపరమైన సదుపాయాలు, రాజకీయ సంకల్పం లోపించినప్పుడు చిన్న సవాళ్ళు సైతం ఎంతో పెద్దవి గా మారిపోతాయన్నారు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ అత్యధిక సంఖ్య లో పరీక్షల ను నిర్వహిస్తూ, టీకా ను ఇప్పిస్తున్న రాష్ట్రం గా నిలచింది అని ఆయన అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లో ఎంతో వేగం గా మెరుగుపడుతూ ఉన్న వైద్య సంబంధి మౌలిక సదుపాయాల ను గురించి, గత నాలుగేళ్ళ లో నాలుగింతలు గా పెరిగిన వైద్య కళాశాల ల సంఖ్య ను గురించి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. చాలా వైద్య కళాశాల లు పూర్తి అయ్యే దశ కు చేరుకొన్నాయని చెప్పారు. రాష్ట్రం లో దాదాపు 550 ఆక్సీజన్ ప్లాంటులు ఏర్పాటవుతున్నాయని, వాటిలో 14 ప్లాంటుల ను ఈ రోజు న ప్రారంభించడమైందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శిశు వైద్య ఐసియు లను మెరుగు పరచడానికి, ఆక్సీజన్ సదుపాయాల ను తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల ను కూడా ఆయన కొనియాడారు. ఇటీవల ప్రకటించిన 23,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఉత్తర్ ప్రదేశ్ కు సాయపడుతుందని ఆయన అన్నారు. పూర్వాంచల్ లో ఒక ప్రధానమైన వైద్య కేంద్రం గా కాశీ నగరం రూపుదిద్దుకొంటోందని ఆయన చెప్పారు. కొన్ని వ్యాధుల కు చికిత్స కోసం దిల్లీ కి, ముంబయి కి వెళ్ళవలసి వచ్చే స్థితి ఉండేదని, ఆ తరహా చికిత్స లు ప్రస్తుతం కాశీ లో లభిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ రోజు న ప్రారంభం జరిగిన కొన్ని పథకాలు నగరం లో వైద్య సంబంధి మౌలిక సదుపాయాల ను మరింత పెంచుతాయి అని ఆయన తెలిపారు.
అనేక పథకాలు పురాతమైన కాశీ నగరాన్ని దాని సారాన్ని పదిలం గా ఉంచుతూనే అభివృద్ధి పథం లోకి తీసుకుపోతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. రాజమార్గాలు, ఫ్లైఓవర్ లు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లు, భూగర్భం లో తీగ మార్గాలు, మురుగు నీటి సమస్య కు, తాగు నీటి సమస్య కు లభించిన పరిష్కారాలు, పర్యటన కు ప్రోత్సాహం వంటి ప్రాజెక్టులు ప్రభుత్వం వైపు నుంచి అపూర్వమైన అండదండల ను అందుకొన్నాయని ఆయన అన్నారు. ‘‘ఇప్పటికీ, 8,000 కోట్ల రూపాయల విలువైన పథకాల పనులు జరుగుతూనే ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి వెల్లడించారు.
గంగా నది శుద్ధి, సుందరీకరణ, కాశీ సుందరీకరణ ఆకాంక్షభరితమైన ప్రాధాన్య పథకాలు అని ఆయన అన్నారు. దీని కోసం, రహదారులు, మురుగు నీటి శుద్ధి, ఉద్యానాల, నదీతీర ఘట్టాల సుందరీకరణ.. ఇలా ప్రతి ఒక్క పని ని చేపట్టడం జరుగుతోంది. పంచ్‌కోసీ మార్గం విస్తరణ, వారాణసీ గాజీపుర్ వంతెన నిర్మాణం అనేక గ్రామాల కు, చుట్టుపక్కల నగరాల కు సహాయకారి అవుతాయి అని ఆయన అన్నారు.
Share this Tweet
నగరం అంతటా ఏర్పాటు చేసిన పెద్ద ఎల్ఇడి తెర లు, ఘట్టాల వద్ద అమర్చిన అత్యాధునిక సాంకేతిక సమాచార పలక లు కాశీ ని సందర్శించే వారికి ఎంతో ఉపయోగపడతాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ఎల్ఇడి తెర లు, సమాచార పలక లు కాశీ తాలూకు చరిత్ర ను, వాస్తు కళ, చేతిపనులు, కళలు, నగరానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఆకర్షణీయమైన పంథా లో ఆవిష్కరిస్తాయని, మరి ఇవి భక్తుల కు గొప్పగా ఉపయోగపడతాయని చెప్పారు. గంగా మాత తీర ప్రాంతం లో హారతి కార్యక్రమం తో పాటు కాశీ విశ్వనాథుని ఆలయం లో ఇచ్చే హారతి కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతోంది, వాటిని ఈ పెద్ద తెర ల ద్వారా నగరం లో ఏ మూలన అయినా చూడటానికి వీలు పడుతుందని చెప్పారు. ఈ రోజు న ప్రారంభించిన రొ-రొ సర్వీసు లు, క్రూజ్ సర్వీసు లు పర్యటన కు ఊతాన్ని ఇస్తాయని, ఈ రోజు న ప్రారంభం అవుతున్న ‘రుద్రాక్ష్’ కేంద్రం నగరం లోని కళాకారుల కు ఒక ప్రపంచ స్థాయి వేదిక ను అందిస్తుందని కూడా ప్రధాన మంత్రి తెలిపారు.
Share this Tweet
కాశీ ని ఆధునిక కాలం లో ఒక జ్ఞానార్జన కేంద్రం గా అభివృద్ధి చేసే అంశాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు. ఇవాళ కాశీ ఒక ఆదర్శ పాఠశాల ను, ఐటిఐ ను, మరెన్నో ఆ తరహా సంస్థల ను అందుకొంది అని ఆయన వివరించారు. సిఐపిఇటి కి చెందిన సెంటర్ ఫార్ స్కిల్లింగ్ ఎండ్ టెక్నికల్ సపోర్ట్ ఈ ప్రాంతం లో పారిశ్రామిక అభివృద్ధి కి తోడ్పడుతుందన్నారు. దేశం లో అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానం గా ఉత్తర్ ప్రదేశ్ ఎంతో వేగం గా రూపుదిద్దుకొంటోందని ప్రధాన మంత్రి అన్నారు. కొన్ని సంవత్సరాల కిందటి వరకు వ్యాపారం చేయాలి అంటే కష్టం గా తోచిన ఉత్తర్ ప్రదేశ్, ఇవాళ ‘మేక్ ఇన్ ఇండియా’ కు ఒక ఆదరణీయమైనటువంటి స్థానం గా మారుతోందని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ఇటీవల అవిశ్రాంతం గా శ్రద్ధ ను తీసుకోవడమైందని, అందుకు ఖ్యాతి ని యోగి ప్రభుత్వాని కి ప్రధాన మంత్రి ఇచ్చారు. డిఫెన్స్ కారిడార్, పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే, బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే, గోరఖ్ పుర్ లింక్ ఎక్స్ ప్రెస్ వే, గంగా ఎక్స్ ప్రెస్ వే లు ఇటీవలి కాలం లో జరిగిన పురోగతి కి కొన్ని ఉదాహరణలు గా ఉన్నాయని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు.
Share this Tweet
దేశం లో వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల ఆధునీకరణ కు ఒక లక్ష కోట్ల రూపాయల తో ఓ ప్రత్యేక నిధి ని ఏర్పాటు చేయడం జరిగిందని, దీనితో మన వ్యవసాయ బజారుల కు కూడా మేలు జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. దేశం లోని వ్యవసాయ బజారుల ను ఆధునికమైనవి గాను, అనేక సౌకర్యాలు కలిగినవి గాను తీర్చిదిద్దడం లో ఇది ఒక పెద్ద ముందంజ అని ఆయన అన్నారు.
Share this Tweet
ఉత్తర్ ప్రదేశ్ లో తాజా గా చేపడుతున్న అభివృద్ధి పథకాల తాలూకు ఒక పెద్ద పట్టిక ను ప్రధాన మంత్రి వినిపిస్తూ, ఇదివరకు కూడా రాష్ట్రం కోసం పథకాలు, నిధులు ఇవ్వడం జరిగినప్పటి కీ వాటికి లఖ్‌నవూ లో ఆటంకం ఎదురయ్యేది అన్నారు. అభివృద్ధి తాలూకు ఫలితాలు అందరికీ అందేటట్లు శ్రద్ధ వహిస్తున్నందుకు గాను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.
Share this Tweet
ప్రస్తుతం యుపి లో చట్టం తాలూకు పాలన నడుస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఒకప్పుడు అదుపు తప్పిన మాఫియా రాజ్, ఉగ్రవాదం ప్రస్తుతం చట్టం పిడికిలి లో ఉన్నాయని ఆయన చెప్పారు. తల్లితండ్రులు వారి కుమార్తెల, సోదరీమణుల భద్రత విషయం లో భయం భయం గా జీవించే వారు. ఆ పరిస్థితి కూడా ఇప్పుడు మారింది. ప్రస్తుతం యుపి లో ప్రభుత్వం అనేది అభివృద్ధి ద్వారా నడుస్తోంది. అంతేగాని అది అవినీతి తోను, బంధుప్రీతి తోను నడవడం లేదు. అందువల్లే ఇవాళ యుపి లో ప్రజలు పథకాల తాలూకు ప్రయోజనాల ను నేరుగా అందుకొంటున్నారు. అందువల్లే ఇవాళ కొత్త కొత్త పరిశ్రమలు యుపి లో పెట్టుబడులు పెడుతున్నాయి. మరి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
కరోనా మరొక్కమారు బలాన్ని పుంజుకోకుండా చూడవలసిన బాధ్యత ఉత్తర్ ప్రదేశ్ ప్రజల కు ఉందని గుర్తు చేస్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఇప్పటికి తగ్గుముఖం పట్టినా, ఏ మాత్రం అజాగ్రత వహించినా ఒక పెను ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే సుమా అంటూ ఆయన హెచ్చరిక చేశారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నియమాల ను ఖచ్చితం గా అనుసరించాలని, ‘‘అందరికీ టీకా – ఉచితం గా అందరికీ’’ అనే ప్రచార ఉద్యమం లో భాగం గా ప్రతి ఒక్కరు టీకా ను వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
***
(Release ID: 1735876)
Visitor Counter : 242
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam