మంత్రిమండలి

ఉక్కు త‌యారీ కి ఉప‌యోగించే కోకింగ్ కోల్ కు సంబంధించి పరస్పర సహకారం కోసం భార‌త‌దేశాని కి, ర‌ష్య‌న్ ఫెడ‌రేశ‌న్ కు మ‌ధ్య అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పంద ప‌త్రాని కి (ఎంఒయు) ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 14 JUL 2021 4:06PM by PIB Hyderabad

ఉక్కు త‌యారీ కి ఉప‌యోగించే కోకింగ్ కోల్ కు సంబంధించి పరస్పర స‌హ‌కారం అనే అంశం పై భార‌త గ‌ణ‌తంత్రాని కి చెందిన ఉక్కు మంత్రిత్వ శాఖ కు, ర‌ష్య‌న్ ఫెడ‌రేశ‌న్ కు చెందిన శ‌క్తి మంత్రిత్వ శాఖ కు మ‌ధ్య అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పంద ప‌త్రాని కి (ఎంఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న సమావేశమైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదాన్ని తెలిపింది.

ప్ర‌యోజ‌నాలు:

ఈ ఎమ్ఒయు తో యావ‌త్తు ఉక్కు రంగాని కి ఇన్ పుట్ కాస్ట్ త‌గ్గి, ప్ర‌యోజ‌నం కలుగనుంది.  దీని తో దేశం లో ఉక్కు ఉత్పాద‌క వ్య‌యం దిగివస్తుంది; అంతేకాదు, స‌మాన‌మైన అవ‌కాశాల కు, ఈ ప‌రిశ్ర‌మ లో అన్ని వ‌ర్గాల ను క‌లుపుకొని పోయేందుకు ప్రోత్సాహ‌ం కూడా లభించనుంది.

భార‌త‌దేశాని కి, ర‌ష్యా కు మ‌ధ్య కోకింగ్ కోల్ రంగం లో స‌హ‌కారాని కి గాను ఈ ఎమ్ఒయు ఒక సంస్థాగత వ్యవస్థ ను ఏర్పాటు చేయ‌గలుగుతుంది.

ఈ అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పందం (ఎమ్ఒయు) ఉద్దేశాల లో ఉక్కు రంగం లో భార‌త ప్ర‌భుత్వాని కి, ర‌ష్యా ప్ర‌భుత్వాని కి మ‌ధ్య గల స‌హ‌కారాన్ని ప‌టిష్ట ప‌ర‌చ‌డం అనేది ఒక‌ ఉద్దేశం గా ఉంది.  స‌హ‌కారాన్ని పెంచాల‌నే కార్య‌క్ర‌మాలు కోకింగ్ కోల్ తాలూకు వ‌న‌రుల ను వివిధీక‌రించాల‌నే ధ్యేయం తో కూడిన‌వి.



 

***


(Release ID: 1735536) Visitor Counter : 178