వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన -IV కింద 15.30 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత ఆహార ధాన్యాలను పంపిణీ చేసేందుకు అందుకున్న 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
పిఎంజికెఎవై-IV కింద 78.26 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అందుకున్న 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆహార ధాన్యాలను ప్రతిబంధకాలు లేకుండా సరఫరా చేసేందుకు రవాణా చేస్తున్న ఎఫ్‌సిఐ
1 ఏప్రిల్ 2021 నుంచి 4005 ఆహార ధాన్యాల రేకులను లోడ్ చేసిన ఎఫ్ సిఐ
Posted On:
13 JUL 2021 3:29PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి కాలంలో ఆహార భద్రతకు హామీ ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పిఎంజికెఎవై-IV పథకాన్ని జులై- నవంబర్ 20-21వరకు అంటే మరో ఐదు నెలల పాటు పొడిగించింది. అంతేకాక, పిఎంజికెఎవై-IV (జులై- నవంబర్ 2021) కింద 198.79 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా కేటాయించింది.
పిఎంజిఎవై-IV కె(జులై- నవంబర్ 2021) కింద ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చత్తీస్‌గఢ్, దాద్రా నాగర్ హవేలీ/ దామన్, దయ్యు, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము&కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లడాక్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిషా, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ సహా 31 రాష్ట్రాలు 12 జులై 2021వరకు 15.30 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అందుకున్నాయి.
పిఎంజికెఎవై-IV ను విజయవంతంగా అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోనూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తగినంత స్టాకులను నిల్వ ఉంచింది. ప్రస్తుతం 583 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 298 మెట్రిక్ టన్నుల బియ్యం (మొత్తం 881 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు) సెంట్రల్ పూల్ కింద అందుబాటులో ఉన్నాయి.
పిఎంజికెఎవై-IV (మే- జూన్ 2021) కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 36 రాష్ట్రాలకు 78.26 లక్షల మెట్రిక్ టన్నులు ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేసింది.
అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు నిరాటంకంగా సరఫరా చేసేందుకు, ఎఫ్‌సిఐ 1 ఏప్రిల్ 2021 నుంచి ఆహార ధాన్యాలను రవాణా చేస్తోంది. దాదాపు 4005 ఆహార ధాన్యపు రేక్ లను ఎఫ్‌సిఐ లోడ్ చేసింది.
***
(Release ID: 1735246)
Visitor Counter : 187