పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
స్వామిత్వ అమలుపై సాధించిన పురోగతిని సమీక్షించిన - ప్రభుత్వం
పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి ఇతర మంత్రిత్వ శాఖలు / సంబంధిత విభాగాలతో కలిసి పని చేయవచ్చు : శ్రీ గిరిరాజ్ సింగ్
పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ చేపట్టిన పథకాలు, కార్యక్రమాల అమలు స్థితిపై మంత్రులకు వివరించబడింది, అనేక అంశాలు చర్చించబడ్డాయి
Posted On:
13 JUL 2021 3:42PM by PIB Hyderabad
స్వామిత్వ పథకం, ఈ-పంచాయతీ కార్యక్రమాల అమలుకు సంబంధించి సాధించిన పురోగతిని కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ మరియు పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ సమీక్షించారు. వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ; మత్స్య మంత్రిత్వ శాఖ; పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ; గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ; జల శక్తి మంత్రిత్వ శాఖ; వినియోగదారుల వ్యవహారాలూ, ఆహారం, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ వంటి ఇతర మంత్రిత్వ శాఖలు / సంబంధిత విభాగాలతో కలిసి పనిచేయడం ద్వారా పంచాయతీ రాజ్ సంస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవచ్చని, శ్రీ గిరిరాజ్ సింగ్, అభిప్రాయపడ్డారు.
2022 లో నిర్వహించనున్న, 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (స్వాతంత్య్ర అమృతోత్సవం) సందర్భంగా, గ్రామ సభ సమావేశాలను సంస్థాగతీకరించవచ్చునని పంచాయతీ రాజ్ మంత్రి కోరారు. అటువంటి సమావేశాలలో విస్తృత స్థాయి అజెండాలు / చర్చలపై దృష్టి కేంద్రీకరించాలని, ఆయన సూచించారు.
కేంద్ర పంచాయితీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్, పంచాయతీ రాజ్ సంస్థలతో తమకు గల గొప్ప అనుభవంతో, పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని పెంచుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఈ సమీక్షా సమావేశంలో - కేంద్ర ఆర్ధిక సంఘం (సి.ఎఫ్.సి) కింద కార్యక్రమాల అమలు, నిర్వహణ ఖర్చులకు సంబంధించిన సమస్యలు; ఈ-గ్రామ స్వరాజ్ కు సంబంధించిన మంత్రిత్వ శాఖలు / విభాగాల జోక్యాలకు సంబంధిత సమాచారాన్ని అందజేయడం; క్రమం తప్పకుండా తగిన / అవసరమైన సమాచారాన్ని తెలియజేయడం పరంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకు చెందిన, ఈ-గ్రామ్ స్వరాజ్, లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్.జి.డి) వంటి, పోర్టల్స్ / డాష్‌బోర్డులను మెరుగుపరచడానికి, అభివృద్ధి పరచడానికి సహకార ప్రయత్నాలు; గ్రామ పంచాయతీల వారీగా కలపడాన్ని సులభతరం చేయడానికి ఎల్.జి.డి. కోడ్ లతో పథకం అమలు సమాచారాన్ని తెలియజేయడం; స్వాతంత్య్ర అమృతోత్సవం నిర్వహణ; ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; స్త్రీ, శిశు అభివృద్ధి; విద్య; వ్యవసాయం; పశుసంవర్ధక మొదలైన వివిధ లైన్ విభాగాల పథకాలతో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యక్రమాలను అనుసంధానం చేయడం; గ్రామ పంచాయతీ భవనాల వద్ద బయోమెట్రిక్ హాజరు వ్యవస్థ అమలు అవకాశం; సాధారణ సేవా కేంద్రాల (సి.ఎస్.సి. లు) పాత్ర / సేవలు; గ్రామ స్థాయి వ్యవస్థాపకుల వంటి అనేక విషయాలను చర్చించారు.
న్యూఢిల్లీ లోని కృషి భవన్ లో 2021 జులై, 9వ తేదీన, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తరువాత, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ తో కలిసి, కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాలను సమీక్షించారు. ఈ పరిచయ సమీక్షా సమావేశంలో, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు స్థితిపై మంత్రులకు వివరించడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు అందరూ పాల్గొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో - పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీ సునీల్ కుమార్; అదనపు కార్యదర్శి, శ్రీ (డాక్టర్) చంద్ర శేఖర్ కుమార్ తో పాటు, మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
*****
(Release ID: 1735242)
Visitor Counter : 198