ప్రధాన మంత్రి కార్యాలయం

పరమ పవిత్రులైన మోరాన్ మార్ బేసెలియోస్ మార్ థోమా పావొలోస్ ద్వితీయ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 12 JUL 2021 9:51AM by PIB Hyderabad

ఇండియన్ ఆర్థోడాక్స్ చర్చ్ కు చెందిన సర్వోన్నత అధిపతి పరమ పవిత్రులైన మోరాన్ మార్ బేసెలియోస్ మార్ థోమా పావొలోస్ ద్వితీయ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

 ‘‘ ఇండియన్ ఆర్థోడాక్స్ చర్చ్ కు చెందిన సర్వోన్నత అధిపతి పరమ పవిత్రులైన మోరాన్ మార్ బేసెలియోస్ మార్ థోమా పావొలోస్ ద్వితీయ కన్నుమూత పట్ల నేను దుఃఖిస్తున్నాను.  వారు సేవ, పరమార్థం,  కరుణ లతో సమృద్ధమైన వారసత్వాన్ని వీడి వెళ్ళారు.   ఈ దుఃఖ ఘడియ లో నేను ఆర్థోడాక్స్ చర్చ్ లోని సభ్యుల కు కలిగిన దుఃఖం లో పాలుపంచుకొంటున్నాను.  ఆయన ఆత్మ కు శాంతి లభించుగాక ’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

***

 

***

DS/SH


(Release ID: 1734732)
Read this release in: Malayalam , English , Urdu , Hindi , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada