ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకా : అపోహలు - వాస్తవాలు


జూలై నెలలో అందుబాటులో ఉంచనున్న టీకా మోతాదుల గురించి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు ముందుగానే తెలియజేయడం జరిగింది

జూలై నెలలో రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు 12 కోట్లకు పైగా టీకా మోతాదులు సరఫరా కానున్నాయి

Posted On: 07 JUL 2021 4:51PM by PIB Hyderabad

అంతకు ముందు వారంతో పోలిస్తే, గత వారం 32 శాతం తక్కువగా టీకాలు వేయడం జరిగిందని ఆరోపిస్తూ,  ఇటీవల కొన్ని ప్రసార మాధ్యమాల్లో వార్తా కథనాలు వెలువడ్డాయి. 

ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరాతో సహా 2021 జూలై నెలలో అందించనున్న టీకా మోతాదుల గురించి అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు చాలా ముందుగానే తెలియజేస్తున్నట్లు స్పష్టం చేయబడింది.  కోవిడ్-19 టీకా మోతాదుల లభ్యత ఆధారంగా వారి కోవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమాలను రూపొందించుకోవాలని, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించడం జరిగింది.

తయారీదారులతో నిర్వహించిన చర్చల ఆధారంగా, 2021 జూలై, నెలలో 12 కోట్లకు పైగా కోవిడ్-19 టీకా మోతాదులను, అందించనున్నట్లు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు, తెలియజేసింది.  ఈ ఉదయం వరకు, 2021 జూలై నెల సరఫరాలో భాగంగా, ఇప్పటికే అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం 2.19 కోట్లకు పైగా మోతాదులను సరఫరా చేయడం జరిగింది.  రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేసే కోవిడ్-19 టీకా మోతాదుల సరఫరాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు, తగినంత ముందుగానే, వారికి తెలియజేయడం జరుగుతోంది.

అదేవిధంగా, పెరిగిన కవరేజ్ దృష్ట్యా ఎక్కువ సంఖ్యలో టీకా మోతాదులు అవసరమైతే, ఆ వివరాలను తెలియజేయవలసిందిగా, అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను కోరడం జరిగింది. (Release ID: 1733509) Visitor Counter : 200