ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

36 కోట్ల టీకా డోసుల మైలురాయి దాటిన భారత్


గత 24 గంటలలో 43,733 కరోనా కొత్త కేసుల నమోదు

చికిత్సలో ఉన్న కేసులు 4,59,920 కు తగ్గుదల; మొత్తం కేసుల్లో అవి 1.50%

రోజువారీ పాజిటివిటీ 2.29%; నెలరోజులుగా 5% లోపే

Posted On: 07 JUL 2021 10:59AM by PIB Hyderabad

నిన్నటికి దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా డోసుల సంఖ్య 36 కోట్ల డోసుల మైలురాయి దాటింది. ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 47,07,778 శిబిరాల ద్వారా  మొత్తం 36,13,23,548 టీకా డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటలలో   36,05,998 టీకాలిచ్చారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.  

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,36,072

రెండో డోస్

73,43,749

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,76,16,750

రెండో డోస్

97,45,413

18-44 వయోవర్గం

మొదటి డోస్

10,47,29,719

రెండో డోస్

30,47,880

45-59 వయోవర్గం

మొదటి డోస్

9,17,29,358

రెండో డోస్

2,06,95,452

60 ఏళ్ళు పైబడ్డవారు

 మొదటి డోస్

6,93,94,933

రెండో డోస్

2,67,84,222

మొత్తం

36,13,23,548

 

కొత్త దశ టీకాల కార్యక్రమం 2021 జూన్ 21న మొదలైంది. కేంద్ర ప్రభుత్వం టీకాల పంపిణీని వేగవంతం చేయటానికి కట్టుబడి దీని పరిధిని మరింత విస్తరించింది. గత 24 గంటలలో  43,733 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా 10 రోజులుగా కొత్త కేసులు 50 వేలలోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషితో ఇది సాధ్యమైంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001N37H.jpg

చికిత్సలో ఉన్న కేసులు క్రమంగా తగ్గుతుననయి. ప్రస్తుతం 4,59,920 కేసులు చికిత్సలో ఉండగా గత 24 గంటలలో నికరంగా 4,437 కేసులు తగ్గాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులలో  1.50% మాత్రమే చికిత్సలో ఉన్నాయి.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00200RM.jpg

కోలుకుంటున్బ్నవారు పెరుగుతున్నకొద్దీ వరుసగా 55 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు.  గత 24 గంటలలో . 47,240 మంది కోలుకోగా వీరి సంఖ్య అంతకు ముందురోజు కంటే   3,507 అదనం

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BZQI.jpg

ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన వారిలో  2,97,99,534 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో  47,240 మంది కోలుకున్నారు, దీంతో మొత్తం కోలుకున్నవారి శాతం  97.18% అయింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0044TGX.jpg

పరీక్షల సామర్థ్యం బాగా పెరగటంతో గత 24 గంటలలో 19,07,216 నొర్థారణ్మ పరీక్షలు జరగగా ఇప్పటిదాకా జరిగిన పరీక్షలు   42,33,32,097 కు చేరాయి.  వారపు పాజిటివిటీ  ప్రస్తుతం 2.39% కాగా రోజువారీ పాజిటివిటీ   2.29% గా నమోదైంది, ఇది గా 167 రోజులుగా 3% లోపే ఉంటోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005MGO2.jpg



(Release ID: 1733508) Visitor Counter : 222