ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకా: అపోహలు - వాస్తవాలు


జూలై నెలలో అందుబాటులోకి వచ్చే టీకా మోతాదుల గురించి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు ముందుగానే తెలియజేయబడింది.

ఎక్కువగా టీకా మోతాదులు అవసరమైతే తెలియజేయాలని, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించిన - కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Posted On: 06 JUL 2021 6:29PM by PIB Hyderabad

గత రెండు రోజులుగా రాజస్థాన్‌ లో కోవిడ్-19 టీకా కొరత ఉందని, ఫలితంగా, కొన్ని కోవిడ్-19 టీకా కేంద్రాలను మూసివేయవలసి వచ్చిందని ఆరోపిస్తూ, ఇటీవల కొన్ని ప్రసార మాధ్యమాల్లో, వార్తా కథనాలు వెలువడ్డాయి.

2021 జూలై నెలలో, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ప్రైవేటు రంగంలోని ఆసుపత్రులకు అందుబాటులో ఉంచుతున్న మొత్తం టీకా మోతాదుల గురించి వారికి తగినంత ముందుగానే సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేశారు.  కోవిడ్-19 టీకా మోతాదుల లభ్యత ఆధారంగా వారి కోవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమాల ప్రణాళికలను రూపొందించుకోవాలని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించడం జరిగింది.

2021 జూలై,  1వ తేదీన, రాజస్థాన్ లో 1.69 లక్షలకు పైగా ఉపయోగించని టీకా మోతాదులు మిగిలి ఉన్నాయి.  జాతీయ కోవిడ్ టీకా కార్యక్రమం కింద, 2021 జూలై, 1వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యకాలంలో భారత ప్రభుత్వం 8.89 లక్షలకు పైగా టీకా మోతాదులను రాష్ట్రానికి ఉచితంగా సరఫరా చేసింది.  వీటికి అదనంగా, 2021 జూలై నెలలో మిగిలిన రోజుల్లో రాజస్థాన్ రాష్ట్రానికి మరో  39 లక్షల 51 వేల టీకా మోతాదులను కేంద్ర ప్రభుత్వం అందించనుంది.  అందువల్ల, 2021 జూలై మొత్తం నెలలో రాజస్థాన్‌ రాష్ట్రానికి 50 లక్షల 90 వేలకు పైగా కోవిడ్-19 టీకా మోతాదులు అందుబాటులోకి రానున్నాయి.  టీకా మోతాదుల ఉత్పత్తి మరియు లభ్యతను బట్టి ఈ పరిమాణం మరింతగా పెరిగే అవకాశం ఉంది.  దీనితో పాటు, ఇంకా, ఎక్కువ పరిమాణంలో కోవిడ్-19 టీకా మోతాదులు అవసరమైతే,  కేంద్ర ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు తెలియజేయవలసిందిగా రాష్ట్రాలను కోరడం జరిగింది. 

టీకాలు జీవసంబంధమైన ఉత్పత్తి కాబట్టి, తయారీ ప్రక్రియకు సమయం పడుతుంది.  ఉత్పత్తి అయిన తర్వాత, టీకాలు నాణ్యత మరియు భద్రత కోసం పరీక్షించబడతాయి. అందువల్ల, టీకా ఉత్పత్తికి తయారీ ప్రక్రియకు సమయం పడుతుంది. అదేవిధంగా తక్షణం సరఫరా చేయడానికి అవకాశం ఉండదు. 



(Release ID: 1733274) Visitor Counter : 176