ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకా : అపోహలు - వాస్తవాలు


కోవిడ్-19 టీకా వల్ల పురుషులు మరియు స్త్రీలలో వంధ్యత్వం వస్తుంది అనడానికి ఏ శాస్త్రీయ ఆధారాలు లేవు

పాలిచ్చే మహిళలందరికీ కోవిడ్-19 టీకాలు వేయాలని సిఫార్సు చేయబడింది

Posted On: 30 JUN 2021 3:27PM by PIB Hyderabad

కోవిడ్-19 టీకాలు వేయడం వల్ల వంధ్యత్వానికి సంబంధించి, మరియు చనుబాలిచ్చే మహిళలకు కోవిడ్-19 టీకాలు వేయడం  సురక్షితమేనా అని, పునరుత్పత్తి వయస్సు జనాభాలో ఆందోళనలు వ్యక్తం చేస్తూ, ప్రసార మాధ్యమాల్లో నివేదికలు ప్రచారంలో ఉన్నాయి. 

ఇటువంటి తరచుగా అడిగే ప్రశ్నలపై (ఎఫ్.ఏ.క్యూ), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.హెచ్‌.ఎఫ్‌.డబ్ల్యూ), తన వెబ్-సైట్ (https://www.mohfw.gov.in/pdf/FAQsforHCWs&FLWs.pdf) లో ఈ విధంగా స్పష్టత ఇచ్చింది.  అందుబాటులో ఉన్న ఏ టీకాలూ, పురుషులు లేదా మహిళల సంతానోత్పత్తిని ప్రభావితం చేయవు.  అలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయో లేదో అంచనా వేయడానికి, ఈ టీకాలన్నీ, ముందుగా జంతువులపైన, ఆ తరువాత మానవుల పైనా,  పరీక్షించడం జరిగింది.  టీకాలు వాటి భద్రత మరియు సమర్థతపై హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఉపయోగం కోసం అనుమతించడం జరిగింది. 

ఇంకా, కోవిడ్-19 టీకా కారణంగా వంధ్యత్వానికి సంబంధించి ప్రబలంగా ఉన్న అపోహలను అరికట్టడానికి, భారత ప్రభుత్వం, (https://twitter.com/PIBFactCheck/status/1396805590442119175కోవిడ్-19 టీకాలు వేసుకుంటే, పురుషులు మరియు స్త్రీలలో వంధ్యత్వానికి కారణమవుతుందని సూచించే శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవని,  స్పష్టం చేసింది.  ఈ టీకాలు సురక్షితంగా మరియు ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది.

కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఆఫ్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్.టి.ఏ.జి.ఐ) చైర్‌పర్సన్ డాక్టర్ ఎన్. కె. అరోరా, ఇటీవల ఒక  ఇంటర్వ్యూలో, ఈ భయాలు మరియు ఆరోపణలను ఖండించారు. భారతదేశంలో మరియు విదేశాలలో పోలియో టీకా ఇచ్చే సమయంలో కూడా, ఇలాగే, టీకా వేసుకున్న పిల్లలు భవిష్యత్తులో వంధ్యత్వానికి గురవుతారనే, తప్పుడు సమాచారాన్ని సృష్టించారని, ఆయన, తెలియజేశారు.  https://pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1730219 ) అన్ని టీకాలు తీవ్రమైన శాస్త్రీయ పరిశోధనల అనంతరం విడుదలవుతాయనీ,  టీకాలలో ఏదీ ఈ విధమైన దుష్ప్రభావాలను కలిగి ఉండదనీ, ఆయన హామీ ఇచ్చారు.

కోవిడ్-19 టీకాలు వేయడానికి ముందు లేదా తర్వాత పిల్లలకు పాలివ్వడాన్ని నిలిపివేయడం లేదా కొంతకాలం ఆపి వేయడం అవసరం లేదనీ, చనుబాలిచ్చే మహిళలందరికీ, ఈ  టీకాలు వేయడం చాలా సురక్షితమనీ, (https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1719925) కోవిడ్-19 టీకా నిర్వహణపై జాతీయ నిపుణుల బృందం (ఎన్.ఈ.జి.వి.ఏ.సి) కూడా సిఫార్సు చేసింది. 


(Release ID: 1731716) Visitor Counter : 316