ప్రధాన మంత్రి కార్యాలయం
వ్యాక్సినేషన్ పురోగతిపై సమీక్షకు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధానమంత్రి
ఈ వారంలో వ్యాక్సినేషన్ వేగం పెరగడం పట్ల ప్రధానమంత్రి సంతృప్తి; ఇదే వేగాన్ని కొనసాగించడం అవసరమని ఉద్ఘాటన
ఏ ప్రాంతంలో అయినా వ్యాధిని కనిపెట్టడం, నిలువరించడంలో టెస్టింగ్ సమర్థవంతమైన సాధనం కావడం వల్ల టెస్టింగ్ ల వేగం తగ్గకుండా చూడడం అత్యంత ప్రధానం : ప్రధానమంత్రి
కోవిన్ సాధనంగా భారతదేశం టెక్నాలజీపరంగా సాధించిన అద్భుతమైన అనుభవాన్ని ఉపయోగించుకోవాలన్న ఆసక్తి కనబరుస్తున్న అన్ని దేశాలు సహాయం అందించేందుకు ప్రయత్నం చేయాలి
6 రోజుల కాలంలో 3.77 కోట్ల డోసుల టీకా వేసిన భారత్; ఇది మలేషియా, సౌదీ అరేబియా, కెనడా వంటి దేశాల కన్నా అధిక జనాభాతో సమానం
Posted On:
26 JUN 2021 7:32PM by PIB Hyderabad
దేశంలో వ్యాక్సినేషన్ పురోగతి, ,కోవిడ్ తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమయ్యారు.
అధికారులు దేశంలో వ్యాక్సినేషన్ పురోగతిని వివరించే సవివరమైన నివేదిక ప్రధానమంత్రి ముందుంచారు. వయసులవారీగా వ్యాక్సినేషన్ కవరేజి వివరాలను ప్రధానమంత్రికి తెలియచేశారు.ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ కార్యకర్తలు, వివిధ రాష్ర్టాల్లోని సాధారణ జనాభాకు వ్యాక్సినేషన్ ఎంత మేరకు ఇచ్చింది కూడా ప్రధానమంత్రికి వివరించారు.
రాబోయే నెలల్లో వ్యాక్సినేషన్ సరఫరాతో పాటు ఉత్పత్తిని పెంచేందుకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు ప్రధానమంత్రికి నివేదించారు.
గత 6 రోజుల్లో దేశంలో 3.77 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగిందని ప్రధానమంత్రికి తెలిపారు.ఇది మలేషియా, సౌదీ అరేబియా, కెనడా దేశాల జనాభా కన్నా అధికం. దేశంలోని 128 జిల్లాలు 45 సంవత్సరాలు పైబడిన 50% పైగా జనాభాకు, 16 జిల్లాలు 45 సంవత్సరాలు పైబడిన 90% పైబడిన జనాభాకు వ్యాక్సినేషన్ ఇచ్చాయని తెలిపారు. ఈ వారంలో వ్యాక్సినేషన్ వేగం పెరిగిన తీరు పట్ల ప్రధానమంత్రి సంతృప్తి ప్రకటిస్తూ ఇదే వేగాన్ని కొనసాగించడం ప్రధానమని నొక్కి చెప్పారు.
వ్యాక్సినేషన్ విషయంలో ప్రజలకు చేరువ కావడానికి అన్వేషించాల్సిన, అమలుపరచాల్సిన కొత్త వైఖరిపై రాష్ర్టాలతో తరచు సంప్రదిస్తున్నట్టు అధికారులు ప్రధానమంత్రికి తెలియచేశారు. ఇలాంటి ప్రయత్నాల్లో ఎన్ జిఓలు, ఇతర సంస్థలను భాగస్వాములను చేసుకోవలసిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి తెలిపారు.
ఏ ప్రాంతంలో అయినా వ్యాధిని కనిపెట్టి, వ్యాధి విస్తరణను నిలువరించడంలో ప్రధాన సాధనం టెస్టింగ్ అయినందు వల్ల టెస్టుల వేగం తగ్గకుండా చూడాలని, ఈ దిశగా రాష్ర్టాలతో కలిసికట్టుగా పని చేయాలని ప్రధానమంత్రి అధికారులకు ఆదేశించారు.
కోవిన్ వేదిక విషయంలో అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆసక్తిని అధికారులు ప్రధానమంత్రికి వివరించారు. కోవిన్ వేదికగా భారత్ సాధించిన అద్భుతమైన సాంకేతిక అనుభవాన్ని ఉపయోగించుకోవాలన్న ఆసక్తి ప్రదర్శిస్తున్న దేశాలన్నింటికీ సహాయం అందించేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి సూచించారు.
(Release ID: 1730635)
Visitor Counter : 231
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada