ప్రధాన మంత్రి కార్యాలయం

మత్తుమందుల దుర్వినియోగం, అక్రమ రాక పోకల కు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినం నాడు ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం

Posted On: 26 JUN 2021 11:24AM by PIB Hyderabad

 



ఈ రోజు న, మత్తుమందుల దుర్వినియోగం, అక్రమ రాక పోకల కు వ్యతిరేకం గా అంతర్జాతీయ దినాన్ని మానవాళి పాటిస్తున్న సందర్భం లో, మన సమాజం నుంచి మత్తు మందుల కంటకభూతాన్ని నిర్మూలించడానికి క్షేత్ర స్థాయి లో పనిచేస్తున్న వారందరికీ ఇవే నా ప్రశంస లు.  ప్రాణాల ను కాపాడేందుకు చేసే ప్రతి ఒక్క ప్రయాస మహత్వపూర్ణమైందే.  ఏది ఏమైనా, మాదకద్రవ్యాలు వాటి తో చీకటి ని, వినాశాన్ని, సర్వనాశనాన్నే వెంటబెట్టుకు తీసుకువస్తాయి మరి.

రండి, #ShareFactsOnDrugs కు మన వచనబద్ధత ను పునరుద్ఘాటిస్తూ, మత్తుమందుల కు తావు ఉండనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించాలనే మన దార్శనికత ను సాకారం చేసుకొందాం.  వ్యసనం అనేది మంచిదీ కాదు, గర్వించే విషయమూ కాదు అనే సంగతి ని గుర్తు పెట్టుకోండి.  మత్తుమందు కంటకభూతం పైన పైచేయి ని సాధించడాన్ని గురించి అనేక అంశాల ప్రస్తావన ఉన్నటువంటి ఓ పాత #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమ భాగాన్ని మీతో పంచుకొంటున్నాను.    


(Release ID: 1730542) Visitor Counter : 177