ప్రధాన మంత్రి కార్యాలయం
అభివృద్ధి చెందిన, ప్రగతిశీల దిశగా జమ్మూకాశ్మీర్ ని తీసుకెళ్లడంలో జరుగుతున్న ప్రయత్నాలలో జమ్మూకాశ్మీర్ పై సమావేశం ఒక ముఖ్యమైన అడుగు : ప్రధాన మంత్రి
జమ్మూకాశ్మీర్ లో అట్టడుగు స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే మా ప్రాధాన్యత: ప్రధాన మంత్రి
డీలిమిటేషన్ త్వరితగతిన జరగాలి, తద్వారా జమ్మూకాశ్మీర్ లో ఎన్నుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు కావలి: ప్రధాన మంత్రి
Posted On:
24 JUN 2021 8:41PM by PIB Hyderabad
అభివృద్ధి చెందిన మరియు ప్రగతిశీల జమ్మూకాశ్మీర్ దిశగా జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా జమ్మూ కాశ్మీర్ కి చెందిన రాజకీయ నాయకులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. సర్వతోముఖాభివృద్ధి ఇక్కడ సాధ్యమయ్యే దిశగా సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశం తరువాత ప్రధాన మంత్రి వరుస ట్వీట్లు చేశారు.
" అభివృద్ధి చెందిన మరియు ప్రగతిశీల జమ్మూకాశ్మీర్ దిశగా ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా జమ్మూ కాశ్మీర్ కి చెందిన రాజకీయ నాయకులతో నేడు జరిగిన సమావేశం సర్వతోముఖాభివృద్ధికి మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం.
మా ప్రాధాన్యత జమ్మూ కాశ్మీర్ లో అట్టడుగు స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం. ఎన్నికలు జరగడానికి డీలిమిటేషన్ త్వరితగతిన జరగాలి మరియు జమ్మూకాశ్మీర్ అభివృద్ధి పథానికి బలాన్నిచ్చేలా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని జమ్మూకాశ్మీర్ పొందుతుంది. చర్చల ద్వారా పరస్పరం ఆలోచనలు పంచుకోవడం మన ప్రజాస్వామ్య అతి పెద్ద బలం. ప్రజలు, ప్రత్యేకించి యువత, జమ్మూకాశ్మీర్ కి రాజకీయ నాయకత్వం ఇవ్వాలి. వారి ఆకాంక్షలు సక్రమంగా నెరవేరాలి అని నేను జమ్మూకాశ్మీర్ నాయకులకు చెప్పాను”
*****
(Release ID: 1730184)
Visitor Counter : 229
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam