ప్రధాన మంత్రి కార్యాలయం
‘టాయికథన్-2021’ లో పాలుపంచుకొన్న వారి తో మాట్లాడిన ప్రధాన మంత్రి
‘టాయికానమి’ లో మెరుగైన స్థానాన్నిసంపాదించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు
అభివృద్ధి ని, వృద్ధి ని అవసరమైన వర్గాల కు చేర్చడంలో ఆటవస్తువుల రంగాని కి ఉన్న ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పారు
దేశవాళి ఆటవస్తువుల కు మనం మద్దతును అందించవలసిన అవసరం ఉంది: ప్రధానమంత్రి
భారతదేశాని కి ఉన్న శక్తి సామర్ధ్యాలనుంచి, భారతదేశకళారంగాన్నుంచి, భారతదేశ సాంస్కృతిక రంగాన్నుంచి, భారతదేశ సమాజాన్నుంచి జ్ఞానాన్నిసంపాదించుకోవాలని ప్రపంచం అనుకొంటోంది; ఈ విషయం లో బొమ్మలు ఒక ప్రధాన పాత్రను పోషించగలుగుతాయి: ప్రధాన మంత్రి
డిజిటల్ గేమింగ్ కు తగినంతముడిపదార్థం, సాధికారిత లు భారతదేశాని కి ఉన్నాయి: ప్రధాన మంత్రి
భారతదేశ స్వాతంత్య్రానికి 75వవార్షికోత్సవం అనేది ఆటవస్తువు ల పరిశ్రమ లో నూతన ఆవిష్కర్తల కు, సృజనశీలుర కు ఒక భారీ అవకాశం: ప్రధాన మంత్రి
Posted On:
24 JUN 2021 1:10PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర ‘టాయికథన్-2021’ లో పాలుపంచుకొన్న వారితో గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు. ఈ సందర్భం లో కేంద్ర మంత్రులు శ్రీ పీయూష్ గోయల్, శ్రీ సంజయ్ ధోత్రే లు కూడా పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి ఈ సందర్భం లో మాట్లాడుతూ, గడచిన అయిదారు సంవత్సరాలు గా హ్యాకథన్ ల వేదిక ద్వారా యువత ను దేశ కీలక సవాళ్ళ తో జతపరచడమైంద న్నారు. దీని వెనుక ఉన్న ఆలోచన దేశం శక్తియుక్తుల ను ఒక చోటు కు తీసుకువచ్చి వాటికి ఒక మాధ్యమాన్ని అందించడం అనేదే అని ఆయన చెప్పారు.
బాలల కు ప్రథమ మిత్రులు అనే విషయం లో ఆటవస్తువుల కు ఉన్న ప్రాముఖ్యానికి తోడు ఆట బొమ్మల మరియు గేమింగ్ తాలూకు ఆర్థిక అంశాల ను కూడా ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. దీనిని ‘టాయికానమి’ అంటూ ఆయన అభివర్ణించారు. ప్రపంచ ఆటవస్తువుల బజారు విలువ దాదాపు 100 బిలియన్ డాలర్లు గా ఉంటే ఆ విపణి లో భారతదేశం వాటా కేవలం సుమారు 1.5 శాతం వాటానే అన్నారు. భారతదేశం తనకు కావలసిన ఆటవస్తువుల లో దాదాపుగా 80 శాతం దిగుమతి చేసుకొంటోందన్నారు. అంటే, కోట్ల కొద్దీ రూపాయలు దేశం నుంచి బయటకు పోతున్నాయన్న మాట. ఇది మారవలసిన అవసరం ఎంతో ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సంఖ్యల ను మించి, సమాజం లో అత్యంత అవసరమైనటువంటి వర్గాల కు అభివృద్ధి ని, వృద్ధి ని అందించే సామర్ధ్యం బొమ్మల తయారీ రంగానికి ఉందని శ్రీ నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆటబొమ్మల తయారీ పరిశ్రమ తనకంటూ ఒక చిన్నతరహా పరిశ్రమ ను, గ్రామీణ జనాభా, దళితులు, పేద లు, ఆదివాసీలతో కూడినటువంటి చేతివృత్తుల వారిని ఏర్పరచుకొందన్నారు. ఈ రంగం లో మహిళల పాత్ర ను గురించి ప్రధాన మంత్రి ప్రత్యేకం గా ప్రస్తావించారు. ఈ వర్గాల వారికి ప్రయోజనాల ను చేరువ చేయడం కోసం మనం స్థానికం గా రూపుదిద్దుకొనే ఆటబొమ్మల కు వత్తాసు పలకవలసివుందన్నారు. భారతీయ ఆటవస్తువులు ప్రపంచ స్థాయిలో పోటీ ని ఇచ్చేదిగా తయారు కావాలంటే కొత్త కొత్త రకాల నమూనాలు, ఆర్థిక సహాయం అవసరమని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. నూతన ఉపాయాల కు బీజం వేయాలని, నవీన స్టార్ట్-అప్స్ ను ప్రోత్సహించాలని, సాంప్రదాయక ఆటవస్తువుల తయారీదారుల కు సరికొత్త సాంకేతిక విజ్ఞానాన్ని అందుబాటు లోకి తీసుకు రావాలని, అంతేకాకుండా కొత్తగా బజారు ను ఏర్పరచాలన్నారు. ‘టాయికథన్’ వంటి కార్యక్రమాల వెనుక ఉన్న ప్రేరణ ఇదేనని ప్రధాన మంత్రి అన్నారు.
ఇంటర్ నెట్ అండదండలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల సంఖ్య లో వృద్ధి, చౌక డేటా లను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, భారతదేశం లో వర్చువల్, డిజిటల్, ఆన్ లైన్ మాధ్యమాల ద్వారా గేమింగ్ అవకాశాల ను అన్వేషించాలని పిలుపునిచ్చారు. బజారు లో అందుబాటు లో ఉన్న ఆన్ లైన్ గేమ్స్, డిజిటల్ గేమ్స్ చాలా వరకు భారతీయత పై ఆధారపడి లేకపోవడం, ప్రస్తుతం ఉన్నటువంటి ఆటల లో చాలా వరకు ఆటలు హింస ను పెంచడం, మానసిక వత్తిడి కి కారణం కావడం విచారకరమన్నారు. భారతదేశం శక్తి సామర్ధ్యాలు, భారతదేశ కళ, సంస్కృతి, సమాజాన్ని గురించి తెలుసుకోవాలని ప్రపంచం కోరుకుంటోందని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. ఈ విషయం లో ఆటవస్తువులు ఒక ప్రముఖ పాత్ర ను పోషించగలుగుతాయని ఆయన అన్నారు. డిజిటల్ గేమింగ్ లో రాణించడానికి భారతదేశం వద్ద యోగ్యత, చాలినంత సరకు ఉన్నాయి అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భారతదేశం వర్తమాన సామర్ధ్యాన్ని, భారతదేశం ఉపాయాల ను గురించిన వాస్తవ చిత్రణ ను ప్రపంచానికి వెల్లడి చేయవలసిన బాధ్యత విషయం లో జాగరూకత తో ఉండాలి అని యువ నూతన ఆవిష్కర్తలు, స్టార్ట్-అప్ లకు శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
భారతదేశాని కి స్వాతంత్య్రం వచ్చి 75వ వార్షికోత్సవం దగ్గర పడుతున్న వేళ, ఆ సందర్భం ఆటవస్తువుల తయారీ పరిశ్రమ లోని నూతన ఆవిష్కర్తల కు, పరిశ్రమ లోని సృజనశీలుర కు ఒక గొప్ప అవకాశం అని ప్రధాన మంత్రి అన్నారు. మన స్వాతంత్య్ర పోరాటం తాలూకు అనేక సంఘటనల ను, మన స్వాతంత్ర్య యోధుల గాధల ను, వారి పరాక్రమాన్ని, వారి నాయకత్వాన్ని ఆధారం చేసుకొని గేమింగ్ కాన్ సెప్టుల ను రూపొందించవచ్చ. ‘జానపద కథల ను భవిష్యత్తు కాలం తో జతపరచడం’ లో ఈ నూతన ఆవిష్కర్తల కు ఒక పెద్ద పాత్ర ఉంది అని ఆయన చెప్పారు. ‘మనసు ను లగ్నం చేసే, వినోదాన్ని అందించే, చదువులు చెప్పే’ ఆసక్తిదాయకమైనటువంటి, పరస్పర అన్యోన్యాన్ని పెంచేటటువంటి ఇంటరాక్టివ్ గేమ్స్ ను రూపొందించవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.
(Release ID: 1730043)
Visitor Counter : 245
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam